ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో టిడిపి కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మూలాలను రూపుమాపాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అలాంటి ఈ తరుణం లో జగన్ చేసిన ప్రతి పనిని విమర్శిస్తూ, ఆయన ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదనే విధంగా మాట్లాడుతున్నారు.. అలా జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రతి పని వెనుక అనేక తప్పులు ఉన్నాయని విమర్శిస్తూ వస్తున్నారు. కానీ చివరికి జగన్ దారి లోనే చంద్రన్న కూడా ప్రయాణిస్తూ అడ్డంగా దొరికిపోతున్నాడు.. దానికి సజీవ సాక్ష్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఏపీ లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కార్యాలయానికి సీల్ వేసేసారు. 

ఇందులో పెద్ద అరాచకం జరిగిందని, దీని సంగతి తేలుస్తామని, పూర్తిగా వారు చేసిన అరాచకాన్ని బయట పెడతామని ప్రగల్బాలు పలికారు చంద్రబాబు ప్రభుత్వం.. జగన్ ప్రభుత్వం ఇందులో మోసం చేసిందని చెప్పుకొచ్చారు. కానీ చివరికి వీళ్లు చెప్పింది ఏది కూడా నడవలేదు.. సైలెంట్ గా ఫైబర్ నెట్ కేసు ను తీసేశారు. అదే ఫైబర్ నెట్ లో టిడిపి సోషల్ మీడియా కు సంబంధించిన వారికి జీతాలు అందిస్తూ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇంతకు ముందు వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు జీతాలు ఇచ్చి పని చేయించుకునేవారు.

అలాంటి ఈ తరుణం లో దీనిపై దర్యాప్తు చేయిస్తామన్న టిడిపి ప్రభుత్వం, జగన్ ఏ విధంగా చేశాడో వీళ్ళు కూడా ఆ విధంగానే చేస్తూ టిడిపి సోషల్ మీడియా నాయకులకు జీతాలు ఇస్తూ జగన్ ను ఫాలో అవుతున్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే..  కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే ఫైబర్ నెట్  కార్యాలయానికి సీల్ వేసిన వీరు, మళ్లీ అదే కార్యాలయం ద్వారా  కూటమి ప్రభుత్వంలో పని చేసే నాయకులకు జీతాలు ఇవ్వడం  విచిత్రం అంటూ చెప్పుకొస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: