భారతీయ రాజకీయాలలో యువత పాత్ర రోజురోజుకి పెరుగుతోంది. ఇటీవలే కేరళకు చెందిన దియా బీను అనే యువతి కొట్టమం జిల్లాలోని వైకోమ్ మున్సిపాలిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. జన్ జీ తరానికి ప్రతినిధిగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి ఆమె సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.(21 ఏళ్లలోపు పుట్టిన వారిని జన్ జీ అంటారు) ఈ పదవి చేపట్టడంతో దేశంలోనే అత్యంత పిన్న వయసులోనే ఇలాంటి రికార్డు సృష్టించిన మహిళగా పేరు సంపాదించింది దియా బీను.


దియా బీను అనుకోకుండా రాజకీయాలలోకి రాలేదు .ఆమె చదువుకునే రోజులలో విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొనేది. అలా ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా విద్యార్థుల సమస్యల పైన కూడా పోరాడుతూ ఉండేది. ఆమెలోని చురుకుదనం ప్రజలతో మమేకమయ్యే మనస్తత్వం , సిపిఎం న్యాయకత్వం వల్ల ఆమెను ఎన్నికలలో పోటీ అయ్యేలా చేశాయి. వైకోమ్ మున్సిపాలిటీలో 24 వ వార్డు నుంచి పోటీ చేసిన ఈమె అపోజిషన్స్ పైన భారీ మెజారిటీతోనే గెలిచింది. దియా విద్యావంతురాలు కావడమే కాకుండా స్థానిక సమస్యల పైన అవగాహన ఉండడంతో ఓటర్లను ఇమే బాగా ఆకట్టుకుంది.


అలా కౌన్సిలర్ గా ఎన్నికైన కొద్ది కాలానికి పార్టీ ఆమెను చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించింది. మున్సిపల్  కౌన్సిల్లో జరిగిన ఈ ఎన్నికలలో కూడా ఈమె భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆ బాధ్యతలను కూడా స్వీకరించింది దియా.  అనంతరం ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత దియా సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా అలాగే టెక్నాలజీని ఉపయోగించి మున్సిపల్ సేవలను ప్రజలకు మరింత చేరు అయ్యేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను అంటూ తెలిపారు. అలాగే పట్టణంలో వ్యర్ధాల నిర్వహణ, మహిళా భద్రత, యువతకు ఉపాధి అవకాశాల పైన ప్రత్యేకించి మరి దృష్టి పెడతానంటూ తెలిపింది. దీంతో కేరళ రాజకీయాలలో యువతకు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది మరొకసారి నిరూపితమయింది. దీంతో సోషల్ మీడియాలో దియాకు అభినందనలు వెల్లువెతుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: