రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో సినిమా పరిశ్రమ కూడా అదేవిధంగా ఉంటుంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సినిమా వ్యవస్థ నడుస్తున్నది కూడా తెలంగాణలోనే.. ఇక్కడే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆఫీసులు స్టూడియోలు ఎక్కువగా ఉన్నాయి.. అలాంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు సినిమా ఇండస్ట్రీలకు సంబంధించి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేసారు. మరి ఆయన ఏమన్నారో ఆ వివరాలు చూద్దాం.. సినిమా ఇండస్ట్రీని వారి రాజకీయ కక్ష్యలను తీర్చుకోవడానికి  ఒక అడ్డాగా మార్చుకున్నారని విమర్శించారు. ముఖ్యంగా కొన్ని సినిమాలకు టికెట్ ధరలు పెంచి మరికొన్ని సినిమాలకు పెంచకపోవడం ఏంటని ప్రశ్నించారు.. 

ఒక సినిమాకు టికెట్ ధరలు పెంచుతూ జీవో వస్తుంది.. మరో సినిమాకు రాదు.. అసలు సినిమాటోగ్రాఫీ మంత్రికి తెలియకుండానే జీవోలు కూడా బయటకు వస్తున్నాయి.. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయంపై నాకు పూర్తిగా ఏమీ తెలియదు అంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలు ఆయనకు తెలియకుండా జీవోలు ఎలా వచ్చాయి.. ప్రభుత్వ రంగంలో మంత్రులకు వ్యాల్యూ ఉందా.. లేదా.. అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు.. అప్పట్లో కేసీఆర్ సర్కారే మళ్లీ వస్తుంది అని అన్నందుకు  ఒక హీరోపై కక్ష్య కట్టారు.. అంతే కాదు ఒక సంఘటనలో సీఎం పేరు మర్చిపోయినందుకు మరో హీరో ను జైలుకు కూడా పంపించారని చెప్పుకొచ్చారు. నీకు నచ్చిన హీరో ఉంటే టికెట్ ధర పెంచుకోవచ్చు.. వారికి 600 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తారు. ఆపై వారం రోజులపాటు అనుమతి మంజూరు చేస్తారు అంటూ హరీష్ రావు ప్రశ్నించారు.. కానీ నీకు నచ్చని వాళ్ళు ఉంటే అసలు మేము సినిమా పరిశ్రమ గురించి పట్టించుకోవటం లేదని కామెంట్లు చేస్తారు..

 50 నుంచి 60 ఏళ్లుగా ఎంతో కష్టపడి సినిమా రంగాన్ని వారు నిర్మించుకున్నారు. మీ సొంత కక్ష్యలతో, అహంకార భావాలతో ఇలా వారిపై పగా ప్రతికారాలు తీర్చుకోవడం, చిల్లర రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ ఫైర్ అయ్యారు.. అసలు ఈ సినిమా రంగం టికెట్ల ధరలు పెంచడం వెనక ఒక రాజ్యాంగేతర శక్తి పనిచేస్తుందని, కనీసం సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండానే చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ వ్యక్తులా.. లేదంటే వేరే వ్యక్తులా అంటూ విమర్శించారు. ప్రస్తుతం సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండానే జీవోలు రావడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు సినిమా వాళ్లతో ఇలా బిహేవ్ చేయవద్దని, సినిమా వాళ్లకు రాజకీయాలకు సంబంధం ఉండదు అంటూ చెప్పుకొచ్చారు. కమీషన్లు తీసుకుంటూ వారికి నచ్చిన వారికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి  అనుమతులు ఇవ్వడం దారుణమని, సినిమా ఇండస్ట్రీలో ఉండే వారంతా సమానమే అని అందరిని సమానంగా చూడాలంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: