గొప్ప పని చేయనప్పుడు  చేసిన పనినే గొప్పగా చెప్పుకోవాలని  ఓ పెద్ద మనిషి చెప్పాడు. ఆయితే ఈ సూక్తిని మన రాజకీయనాయకులు బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటారు. తాము ఏమి చేస్తే..  అదే గొప్ప ఘనకార్యం అన్నట్లు  ఓ రేంజ్ లో పబ్లిసిటి ఇచ్చుకుంటారు. నిజాలను పాతరేసి, ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు మాయచేయడంలో  చంద్రబాబుగోరు మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.  మన బాబుగోరు  తాను చేసున్న పనే గొప్పదని... అందరూ అదే అనుకోవాలని సత్యాలను అసత్యాలుగా నమ్మించిన సందర్భాలు కోకొల్లలు. అయితే విచిత్రంగా మన  జగన్ మోహన్ రెడ్డి కూడా బాబుగోరి దారిలో వెళ్తున్నారు. 


బాబుగోరికి మల్లే  తన గొప్పలు చెప్పుకోవటానికి కొన్ని వాస్తవాలను  దాచిపెడుతున్నాడు జగన్.  సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజే  పెంఛన్లు 2250 ఇస్తున్నట్లు జగన్  ప్రకటించాడు, తీరా ఆ రోజు ప్రకటన ఈ రోజుకి కానీ ఆచరణలోకి రాలేదు. ఈ రోజు నుండే  పెంఛన్లు ఇవ్వటం స్టార్ట్ చేసారు. అయితే ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 'నాలుగునెలల క్రితం తాతఅవ్వలను  మీకు పెంఛన్లు వస్తున్నాయంటే.. చాలమంది రావటం లేదని చేప్పేవాళ్లు.. కేవలం కొద్దీ మంది మాత్రమే 1000 ఇస్తున్నారని చెప్పారు. కానీ  నేను సీఎం అయిన మొదటి నెలలోనే దానిని 2250కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నానని జగన్ చెప్పుకొచ్చాడు. 

  

వాస్తవానికి చంద్రబాబు నాయుడు  2019  జనవరిలోనే  1000 రూపాయాల పెన్షన్ ను 2000కి పెంచారు. అందరికీ  పెన్షన్ ను ఇచ్చారు. అందేలా చూశారు. ఓట్లు కోసమే అనుకోండి.  అయితే  బాబు పెంచిన    పెన్షన్ ను జగన్ మాత్రం ఎక్కడ మాట్లాడకుండా  తనే  1000 నుండి 2250కి  పెంచినట్లు పబ్లిసిటీ చేసుకుంటున్నాడు.  బాబు తన ఐదేళ్ల పదవి కాలంలో అంతకుముందు ఉన్న పెన్షన్ కి  10 రేట్లు పెంచాడు.  జగన్ కేవలం రెండున్నర రేట్లు పెంచాడు. మరి ఇది ప్రజలకి అర్ధం కాదా..  బాబు ఘనత కూడా తనదే అని చెప్పుకోవడం జగన్ స్థాయిని  తగ్గించేదే.  


మరింత సమాచారం తెలుసుకోండి: