మ‌న ఇండియ‌న్ పార్ల‌మెంటులో శ్రీరాముడి ముని మ‌న‌వ‌రాలు ఉన్నారు.. విన‌డానికే కాస్త షాకింగ్ ఉన్నా ఇప్పుడు ఇదే పార్ల‌మెంటులో హాట్‌టాపిక్‌గా మారింది. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి త‌న ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయని... వాటిని తాను కోర్టుకు స‌మ‌ర్పిస్తాన‌ని ఓ బీజేపీ లేడీ ఎంపీ చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. తాను శ్రీరాముడి వంశానికిని చెందిన వ్యక్తినని ఓ పార్లమెంటు సభ్యురాలు ప్రకటించారు. 


తాను శ్రీరామ‌చంద్రుడి కుమారుల్లో ఒక‌రైన కుశుడి వంశానికి చెందిన వార‌మ‌ని కూడా ఆమె ప్ర‌క‌టించుకున్నారు. ఆమె బీజేపీకి చెందిన ఎంపీ కావ‌డంతో స‌హ‌జంగానే విప‌క్షాలు విమ‌ర్శ‌లు స్టార్ట్ చేసేశాయి. ఆమె ప్ర‌క‌ట‌న‌తో విప‌క్షాలు శ్రీరామ‌చంద్రుడి మునిమ‌న‌వ‌రాలు పార్ల‌మెంటులో ఉంద‌బ్బా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంత‌కు ఆ శ్రీరాముడి మ‌న‌వ‌రాలు ఎవ‌రు ? ఆమె ఎక్క‌డ నుంచి వ‌చ్చారో ? ఆ స్టోరీ ఏంటో ?  చూద్దాం.


హిందువులు ఎంతో భక్తితో కొలిచే శ్రీరాముడి కుమారుడు కుశుడి వంశీకుల‌మే తాము అని బీజేపీ ఎంపీ, జైపూర్ రాజ‌కుటుంబీకుల‌కు చెందిన దియా కుమారి తెలిపారు. అయోధ్య-బాబ్రీ మసీదు కేసు విచారణ సందర్భంగా... రాముడి రఘువంశానికి చెందినవారు ఎవరైనా ఇప్ప‌ట‌కీ అయోధ్య‌లో ఉన్నారా ? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా దియా పై వ్యాఖ్య‌లు చేశారు. రాముడు వార‌సులు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్నార‌ని కూడా ఆమె పచెప్పారు.


ఈ క్ర‌మంలోనే అయోధ్య ఆల‌య వివాదాన్ని త్వ‌ర‌గా ప‌రిష్క‌రించాల‌ని కోరారు. సుప్రీంకోర్టు కోరితే తమ వద్ద ఉన్న ఆధారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే కేసు విషయంలో తాము కలగజేసుకోబోమని చెప్పారు. ఏదేమైనా దియా కుమారి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి.అదే టైంలో ఆమె వ్యాఖ్య‌ల‌పై విప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. మ‌రి ఈ విష‌యంలో సుప్రీంకోర్టు ఏం చేస్తుందా ? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: