కృష్ణాజిల్లా పచ్చని పంట పొలాల మధ్య కళకళలాడుతూ ఉండే గ్రామాల్లో గత కొంతకాలంగా పాముల బెడద వెంటాడుతోంది. వరుస గ్రామాల్లో పాము కాట్లకు ప్రజలు గురికావటంతో ఇల్లు విడిచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఏ మూల ఏ పాము దాగివుందో, వీధుల్లో కి వస్తే ఏ పొదల చాటు నుంచి పాము బయటకొచ్చి కాటేస్తుందో నన్న భయంతో గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇటీవల వర్షాలకు పచ్చదనం ఎక్కువ ధనం కావడంతో పొలాల్లో అధిక దిగుబడుల కోసం గులికలు లాంటి విషపదార్ధాలు ఉండటంతో వాటి వాసనకు పాములు నేరుగా నివాసాల్లోకి వచ్చేస్తున్నాయని కొంత మంది గ్రామస్తులు చెబుతున్నారు .తూర్పు కృష్ణా లోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు తో పాటు చల్లపల్లి, నూజివీడు, తిరువూరు ప్రాంతాలు పశ్చిమ కృష్ణా లోని నందిగామ, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, జగ్గయ్యపేట మండలాల్లో ఈ పాము కాట్ల బారినపడినవారు ఎక్కువ మందే ఉన్నారు.

ప్రధానంగా పదిహేను రోజుల వ్యవధి లోనే ఒక్క చందర్లపాడు మండలం బొబ్బిళ్లపాడులో ఐదుగురు పాము కాటుకు గురవ్వగా వారిలో నలుగురు అత్యవసర చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అభం శుభం తెలియని మురళి అనే బాలుడు మాత్రం సర్పం కాటుకు బలయ్యాడు. మురళీ చనిపోయిన తీరు మరింత దయనీయం తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే మంచంపై పడుకొని నిద్రిస్తూ ఉండగా ఇంట్లోకి ప్రవేశించిన పాము బాలుడ్ని కాటేసింది. వైద్య చికిత్స కోసం బాలుడి ని ఆసుపత్రికి తరలించారు. కానీ బాలుడు చేతికి రెండు చోట్ల విషసర్పం గట్టిగా కాటేసిందని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించాలని వైద్యు లు సూచించారు.

వైద్యుల సూచన మేరకు బాలుణ్ణి విజయవాడ ఆసుపత్రి కి తరలించి చికిత్స చేస్తుండగా బాలుడు చనిపోయాడు.టీవీలో బొమ్మలు చూపిస్తూ నిద్రపుచ్చిన తండ్రి తన కొడుకు శాస్వత నిద్రలోకి వెల్లాడని తెలిసిన తల్లిదండ్రులు వారి ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. నందిగామ పరిసర ప్రాంతాల్లో వరుసగా విషసర్పాల కాటుతో గ్రామస్థు లు హడలిపోతున్నారు. అసలు ఈ పాములు జనసంచారం లోకి వస్తున్నాయనేది కూడా అంతుపట్టకుండా ఉంది ఇటీవలి కాలంలో గ్రామాల సరిహద్దులో మిరపనారు పెంచేందుకూ ఫాంహౌసులూ నిర్మాణం చేయటం.

ఎటువంటి క్రిమికీటకాలు చేరకుండా విషగుళిక లను మోతాదుకు మించి ఫాంహౌసులో చల్లడం తో పాటు, ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు గ్రామ పరిసరాలని పచ్చిక బయళ్ల తో వాతావరణం మారిపోవడంతో ఈ విషసర్పాలూ జన సంచారం ఉండే నివాసాలకూ వస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.వర్షాల కారణంగా కరెంటు ఉండక పోవడంతో చీకటి కారణంగా ఈ పాము కాటు పరిస్ధితులు ఎక్కువవుతున్నాయని, తాము ఇళ్లల్లోంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు అని ఒకవేళ వచ్చినా ఎప్పటికప్పుడు అటూ ఇటుగా చూసుకోవడం తమ కాళ్ళను కూడా చూసుకోవడం జరుగుతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

ఇటీవల పశ్చిమ కృష్ణాలో పాము కాటుకు గురైన వారి వివరాలు చూస్తే ఒకింత దిగ్భ్రాంతికి గురవక తప్పదని మరికొందరు నాటు వైద్యాన్ని నమ్ముకొని వారి ప్రాణాలకు ముంపు తెచ్చిపెట్టుకుంటున్నారు.వీరికి మెరుగైన వైద్య సౌకర్యాలు సంబంధిత ప్రాథమిక చికిత్స కేంద్రాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని  ప్రస్తుతం ఉన్న పరిస్ధితిలో అవి కూడా  ఇరవై నాలుగు గంటల పాటు పని చేసే విధంగా చూస్తే కొంత వరకు ఇబ్బందులు తప్పుతాయని ఆ ఊరి గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం ముఖ్యమైన అంశంగా పరిగణించి వీలైనంత త్వరగా ఏదో ఒక ఉపాయం చూడాలని గ్రామస్థులు వాపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: