అవినీతి, అక్ర‌మాల‌ను స‌హించేది లేద‌ని ప్ర‌క‌టించిన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆచ‌ర‌ణ‌లో దానిని నిరూపిస్తున్నారు. సీనియ‌ర్ నేత‌గా ఉన్న మాజీ స్పీక‌ఱ్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు అసెంబ్లీ సామాగ్రిని త‌న ఇంటికి త‌ర‌లించుకున్న ఉదంతంలో కీల‌క ప‌రిణామం సంభ‌వించింది.  రాష్ట్ర విభజన పూర్తయినా మార్చి నెల 2017 వరకూ హైదరాబాద్ లోనే అసెంబ్లీ కొనసాగేది. ఎలా అయిన సొంత గడ్డ మీద అసెంబ్లీ నిర్వహించాలని భావించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని ఏపీలోని అమరావతిలో నిర్మించారు. అయితే ఆ కొత్త భవనానికి ఫర్నీచర్‌ హైదరాబాద్‌ నుంచి తరలించేటప్పుడు కొంత మేర ఫర్నీచర్‌ మాయమైనట్లు గుర్తించారు. 


రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీ ప్ర‌భుత్వ‌ హయాంలో హైదరాబాద్ నుంచి అసెంబ్లీని అమరావతికి తరలించారు. అయితే ఆ సమయంలో అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచ ర్‌లో కొంతమేర కోడెల శివప్రసాదరావు తన నివాసానికి  తరలించుకున్నారు. అయితే, ఈ విష‌యంలో ఆయ‌న ముందుగా స్పంద‌న లేదు.

కోడెల త‌న ఇంటికే ఫ‌ర్నీచ‌ర్ తీసుకుపోయాడ‌నే ప్ర‌చారం జ‌రిగిన నేప‌థ్యంలో మాజీ స్పీక‌ర్ మీడియా ముందుకు వ‌చ్చి  త‌న ఇంటికే ఫర్నీచర్ తీసుకుపోయాన‌ని అంగీక‌రించారు. కోడెల ప్ర‌క‌ట‌న‌, అసెంబ్లీ ఫర్నీచర్‌ను త‌న సొంత‌ నివాసానికు తరలించుకున్న ఉదంతంలో అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ చీఫ్ మార్షల్‌ గణేశ్ బాబుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.


ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల వ్యవహారంతో సంబంధం ఉన్న వారి వివ‌రాల‌ను క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేయ‌గా, ప్రస్తుతం అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా ఉన్న గణేశ్ బాబు పాత్ర బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం. దీంతో  చీఫ్ మార్షల్ గణేశ్ బాబు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఆయ‌న్ను అక్టోపస్‌ విభాగానికి ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: