విమాన  సర్వీసులను నడపడం చాలా కంపెనీలకు భారంగా మారింది.  ఈ రంగంలో పోటీ పెరగడంతో పాటు విమాన ఇంధన ధరలు పెరిగిపోవడంతో పాపం చాలా సంస్థలు దివాళా తీస్తున్నాయి.  పోటీని  తట్టుకోలేక కొన్ని సంస్థలు మరో సంస్థతో కలిసి కొత్త సంస్థగా ఏర్పడుతున్నాయి.  ఇలా ఒకదానితో మరొకటి లింక్ ఏర్పాటు చేసుకుంటూ ఎలాగోలా నెట్టుకొస్తున్నాయి.  ఇండియాలో పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి.  కొత్త విమాన సంస్థలు ఏవీ కూడా ఇప్పట్లో ఏర్పాటు కాలేదు.  


కింగ్ ఫిషర్ వంటి కొన్ని సంస్థలను  ఇప్పటికే మూసేశారు.  మరికొన్ని ఇబ్బందికరంగా నడుస్తున్నాయి. ఎయిర్ ఇండియా సైతం ఇబ్బందుల్లో పడింది.  విమానయాన రంగం చాలా కీలకమైన ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దీంతో ఆయా కంపెనీలు సర్వీసులను నిలిపివేయడం లేదంటే కొన్నాళ్లపాటు సర్వీసులను ఆపేసి స్థాయికి వస్తున్నాయి.  సమర్ధవంతంగా నడిపే సత్తా వచ్చిన తరువాత తిరిగి సర్వీసులను పునరుద్దరించవచ్చు అనే ఆలోచనలో ఉన్నాయి.  ఒక్క ఇండియానే కాదు చాలా దేశాల్లో ఇదే విధమైన పరిస్థితిలు నెలకొన్నాయి.  


ఇండియాలో పరిస్థితులు ఇలా ఉంటె, అసలే పుట్టెడు అప్పుల్లో, బాధల్లో, ఉగ్రవాదుల అధీనంలో పనిచేస్తున్న పాకిస్తాన్ లో మరోలా ఉన్నది.  పాకిస్తాన్ కు చెందిన పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ 2016-2017 సంవత్సరాల్లో 46 అంతర్జాతీయ సర్వీసులను ప్రయాణికులు లేకుండా నడిపింది.  పాక్ నుంచి మక్కాకు ఈ ట్రిప్పులను నడిపిందట.  దాని వలన రూ. 18 కోట్లు నష్టం వచ్చింది. 


ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఆ సంస్థ కూడా వివరణ ఇచ్చుకోలేదు.  46 సర్వీసులను ప్రయాణికులు లేకుండా నడపడం అంటే మామూలు విషయం కాదు.  లేనిపోని నష్టాలను, కష్టాలనూ కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో.  ఉగ్రవాదులను పెంచి పోషించడంలోనూ, ఇండియాపై కంప్లైంట్ చేయడంలోనూ ముందుండే పాక్, ఆ దేశంలో జరుగుతున్న విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదు.  ముందు ఇల్లు బాగుచేసుకున్నాక బయట ఎలా ఉందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: