జగన్ చూస్తే నాలుగు నెలల్లోనే చాలా కార్యక్రమాలతో జనంలో దూసుకుపోతున్నారు. జగన్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇపుడు ఏపీలో  ప్రధాన‌ ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పడేశాయి. జగన్ ముఖ్యంగా సంక్షేమంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిధ్ధపడుతున్నారు. దాంతో ఆయనకు గ్రామీణ ప్రాంతంలో పట్టు పెరుగుతుందని భావిస్తున్నారు.


ఈ నేపధ్యంలో ప్రతిపక్ష నేత, మూడు మార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు జగన్ ఢీ కొట్టేందుకు సీరియస్ ఇష్యూ ఒక్కటీ దొరకడంలేదట. ప్రతీ చిన్న విషయాన్ని పెద్దది చేసి చూపడానికి అనుకూల మీడియా ఉన్నా కూడా అది జనంలో మాత్రం ప్రొజెక్ట్ కావడంలేదు. చలో ఆత్మకూర్ సంఘటన వల్ల మీడియాలో ప్రచారం లభించింది తప్ప ప్రజలలో ఇంచ్ అయినా కదలిక లేదు ఇక మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుని అడ్డంపెట్టుకుని చేసిన శవరాజకీయం కూడా బెడిసికొట్టింది. శివప్రసాద్ బతికిఉన్నపుడు చంద్రబాబు ఏ విధంగా ఇల్ ట్రీట్మెంట్ చేశారన్నది అందరికీ తెలియడంతో ఈ పొలిటికల్  డ్రామా సరిగ్గా  పండలేదు. వైసీపీ సర్కార్ రాజకీయ వేధింపులు అంటూ గొంతు చించుకున్నా అది కూడా వర్కౌట్ కాలేదు.



ఈ సమయంలోనే గోదావరిలో బోటు ప్రమాదం కూడా జరిగింది. అయితే దాన్ని పెద్ద ఇష్యూగా చేయాలంటే ముందు టీడీపీ తన భుజాలు తడుముకోవాల్సివస్తుంది. ఎందుకంటే గత అయిదేళ్లలో ఇలాంటి సంఘటనలు టీడీపీ జమానాలో ఎన్నో జరిగిపోయాయి. అందువల్ల దాన్ని పట్టుకుంటే బూమరాంగ్ అవుతుందన్న భయం టీడీపీలో ఉండడంతో వదిలేశారు. ఇక గ్రామ సచివాలయం పరీక్షల్లో లీకేజ్ అంటూ ఎల్లో మీడియా అల్లిన‌ కట్టు కధకు తానా తందానా అని టీడీపీ అంటున్నా వెనక లక్షా పాతిక వేల మంది పరీక్ష గెలిచిన అభ్యర్ధులు, వారి కుటుంబాలు కూడా ఉన్నాయి. దాంతో తేడా వస్తే ఆ కుటుంబాలన్నీ టీడీపీకి యాంటీ అవుతాయన్న భయం ఉంది. మొత్తం మీద చూసుకుంటే జగన్ మీద పోరాడడానికి బాబుకు అర్జంట్ గా ఓ బ్రహ్మాస్త్రం కావాలి. దాని కోసం ఆశగా ఆయన ఎదురుచూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: