కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలకు సీఆర్డీఏ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. అక్రమ కట్టడాలపై నిబంధనల మేరకు సీఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు పాతూరి కోటేశ్వరరావుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని సీఆర్డీఏ సిబ్బంది తొలగిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇంటిని కూల్చివేస్తున్నారని ఒక వర్గం మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. 
 
కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు అయితే ఇప్పటికే ప్రారంభం అయింది. ఇప్పటికే అనేకసార్లు సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. కొంతమంది ఆ నోటీసులకు జవాబులు ఇచ్చారు. నోటీసులకు జవాబు ఇవ్వనివారితో పాటు, జవాబు ఇచ్చినప్పటికీ జవాబు సంతృప్తికరంగా లేని పక్షంలో వారికి అధికారులు ఫైనల్ నోటీసులను ఇచ్చారు. 
 
అందులో భాగంగానే ఈరోజు పాతూరి కోటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన నిర్మాణాన్ని తొలగించే కార్యక్రమం సీఆర్డీఏ అధికారులు చేపట్టారు. అక్రమంగా నిర్మాణం ఉండటంతో నిర్మాణాన్ని పూర్తిగా తొలగించారని సమాచారం అందుతుంది. సీఆర్డీఏ అధికారులు ఎటువంటి అనుమతి లేకుండా నిర్మించిన భవనాలతో పాటు నదీగర్భంలోకి చొచ్చుకువెళ్లిన నిర్మాణాలపై ముందుగా దృష్టి పెట్టారని తెలుస్తోంది. 
 
అక్రమ నిర్మాణాలను ఇప్పటికే అధికారులు పూర్తిగా గుర్తించటం జరిగింది. నదీప్రవాహానికి ఏవైతే అడ్డుగా ఉన్నాయో ఆ భవనాలను గుర్తించారు. 19వ తేదీన చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కు కూడా నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చివేస్తారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలోని ప్రజావేదిక సహా ఇతర అక్రమ నిర్మాణాలపై గతంలోనే చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను ఎందుకు తొలగించకూడదో చెప్పాలని గతంలోనే నోటీసులు జారీ చేశామని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. 
 
 
 


 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: