మన జీవితం చాలా చిన్నది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో ఎవరూ ఊహించలేం. ఈ చిన్న జీవితంలో మనం ఎలా జీవించామన్నదే సమాజం చూస్తుంది. మన జీవితంలో విలువైనవి ఏవీ సులువుగా దొరకవు. కెరీర్ లో సక్సెస్ అయినా, సొంత ఇల్లు అయినా, తల్లిదండ్రులకు ఎటువంటి కష్టం కలగకుండా సంతోషంగా చూసుకోవాలన్నా ఎంతో ఓపిక, శ్రమ అవసరం.

 

ఈ రెండు లక్షణాలు కలిగి ఉండి ఏ విషయంలోనైనా సక్సెస్ కొరకు ప్రయత్నిస్తే ఆలస్యంగానైనా ఫలితం దొరుకుతుంది. ఎన్నో రోజులు పడిన కష్టాన్ని ఫలితం ఒక్క నిమిషంలోనే మరిచిపోయేలా చేస్తుంది. అంచెలంచెలుగా జీవితంలో మరింత ఎదగటానికి మన సక్సెస్ తోడ్పడుతుంది. అలా కాకుండా జీవితంలో విలువైనవి కోరుకుంటే మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మనం కూడా ఎదుగూబొదుగు లేకుండా ఆగిపోతాం.

 

IHG

 

మనలో ప్రతి ఒక్కరూ బాల్యం నుంచే పెద్దయ్యాక కలెక్టర్, డాక్టర్, పైలెట్, ఇంజనీర్ కావాలని కలలు కంటూ తమ ఆశయాలను, లక్ష్యాలను ఇతరులకు చెప్పుకుంటారు. పెద్దయ్యాక వాళ్లలో కొందరు జీవితంలో ఎంచుకున్న లక్ష్యాలను సాధిస్తే మరికొందరు మాత్రం జీవించడం కోసం చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. కష్టపడకుండా విలువైన వాటి కోసం ప్రయత్నిస్తే నిరాశజనకమైన ఫలితాలే వస్తాయి.

 

విలువైన వాటిని ఆశించడంలో తప్పు లేదు. కానీ ఎలాంటి ప్రయత్నం చేయకుండా అవి సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం ఎప్పటికీ పైకి ఎదగలేం. చాలామంది తమపై తమకే నమ్మకం లేక ఇతరులతో పోల్చుకుంటూ సక్సెస్ కాలేకపోతూ ఉంటారు. మనల్ని మనం నమ్మి విలువైన వాటి కోసం ఫలితం దక్కే చివరి నిమిషం వరకు శ్రమిస్తూ ముందడుగులు వేస్తే జీవితంలో ఉన్నతస్థానాలకు ఎదగగలుగుతాం. సులువుగా విలువైనవి కావాలనుకుంటే మాత్రం అత్యాశే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: