మన పెద్దలు సందర్భాన్ని బట్టి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సామెతను ఉపయోగిస్తూ ఉంటారు.. అలానే ఇప్పుడు కూడా ఒక మంచి మాట మన ముందుంది..విజయం అనేది ప్రతి ఒక్కరికీ దక్కుతుంది.. కానీ ఆ విజయం ఎలా దక్కింది అనేది ముఖ్యం..  కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా విజయాన్ని చేరుకోలేరు..  కానీ కొంతమందికి ఏమో విజయం అదృష్టంలా వరిస్తుంది. కానీ గెలిచిన వారికీ ఓడిన వారికీ మధ్య తేడా చాలా ఉంటుంది.. గెలిచిన వారి కంటే ఓడిన వారికే ఏ విషయం పై నైనా పట్టు ఎక్కువ ఉంటుంది..



ఉదాహరణకు ఏదైనా ఒక పరుగు పందెం ని తీసుకుందాం.  మనం చిన్నప్పుడు చదివే ఉంటాం తాబేలు, కుందేలు పరుగు పందెం కథ.. కుందేలు ఏమో వేగంగా పరుగెడుతుంది.  మరి తాబేలు అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంది. కానీ విజయం సాధించాలనే పట్టుదల తాబేలుకు ఉండడంతో ప్రయత్నించి, ప్రయత్నించి చివరకు గెలుస్తుంది. కాబట్టి ఏదైనా సరే మనం ప్రయత్నిస్తే నే  గెలుస్తాము అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.


ఒకసారి ఓడిపోయిన అంతమాత్రాన జీవితం అంతటితో అయిపోదు.  మనకు శక్తి ఉన్నంతవరకూ పోరాడుతూనే ఉండాలి. కేవలం ఈ ఒక్క చిన్న పనే కాదు.. మనం ప్రస్తుతం పుస్తకాల్లో చదువుకుంటున్న ఎంతో మంది శాస్త్రజ్ఞులు..వారు సాధించిన అన్ని రంగాలలోనూ ఒకేసారి వారు విజయాన్ని సాధించలేదు. ఎన్నోసార్లు ఓటమిని రుచి చూసిన తర్వాతనే వారు విజయాన్ని సాధించారు..


కాబట్టి మనం కూడా ఏ విషయంలో నైనా విజయాన్ని సాధించాలంటే మాత్రం, ఒకసారి ఓడిపోతే దాన్ని వదిలేయకూడదు. పదేపదే ప్రయత్నించి చివరికి విజయం చేరుకోవాలి.  అప్పుడే మన జన్మకు సార్థకమవుతుంది.. అప్పుడే మన పెద్ద వాళ్లు మనకు చెప్తూ ఉంటారు ఓడిపోయామని బాధ పడకు...విజయం వచ్చే వరకూ పోరాడు అని..ఫ్రెండ్స్ మీరు కూడా ఏదైనా ఒక విషయం పై  ఓటమిని చవి చూస్తే,అది మీ విజయానికి నాంది అని గుర్తుంచుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: