సృష్టిలో ప్రతి పుట్టుక వెనక ఒక పరమార్థం ఉన్నట్టుగానే, మనిషి జీవించినంత కాలం సరైన మార్గంలో నడవాలి. అప్పుడే పంచభూతాలు సహకరించి జీవితం మరింత సులభతరం అవుతుంది. ఎదుటివారితో ఏవిధంగా మాట్లాడాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా గుర్తుంచుకోవాలి..కష్టమైన, నష్టమైన సంతోషంగా మాట్లాడాలి. ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు వారికి కావలసిన అన్ని సపర్యలూ దగ్గరుండి చూసుకోవడమే కాకుండా.. వారు వెళ్లేటప్పుడు వారి వెనకాలే కొంతదూరం నడవడం సంస్కారం..

బయటకు వెళ్లి వచ్చినప్పుడు తప్పకుండా సుచి శుభ్రతను  ఆచరించాలి.. ఉదయం, సాయంత్రం తప్పకుండా దేవుడి ముందు ఒక దీపం వెలిగించి, భగవంతుని స్మరణ చేసుకోవాలి. మనం తినే ముందు ఒక ముద్ద అన్నం.. కాకులకు పిండప్రదానం చేసిన తర్వాత ని ప్రతిరోజు మనం భోజనం చేయాల్సి ఉంటుంది. ఇక ఆలుమగలు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే, ఇద్దరి మధ్య సామరస్యత కలిగి ఉండాలి. భర్త అరిచిన అప్పుడు భార్య సర్దుకుపోవాలి.. ఒక వేళ భార్య కోప్పడినప్పుడు భర్త బుజ్జగించాలి. అప్పుడే ఆ సంసారం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో కొనసాగుతుంది.

మీ ఇంట్లో ఎవరైనా చదువుకునే వారు ఉన్నట్లయితే వారు సాయంత్రం పూట చదవనివ్వకుండా చేయడమే ఉత్తమం. ఇక నిద్ర పోవడం, తిండి తినటం లాంటివి సాయంత్రం పూట అసలు చేయరాదు. భర్త భార్యతో రాత్రి సమయంలో సంభోగం చేయాలి అనుకుంటే..  భోజనం చేసిన మూడు గంటల తర్వాతే ఆమెతో సంతోషంగా సంభోగం చేయవచ్చు. భార్య అంగీకారం లేనిదే భర్త ఆమెను తాకినా కూడా అది పరమ పాపం అవుతుంది అని వేదాలు చెబుతున్నాయి..

పరాయి స్త్రీల యందు , అవివాహిత స్త్రీల యందు చెడు ఉద్దేశం కలిగి ఉండరాదు. దానిని కామము అని అంటారు.. ఒక్క భార్య తప్ప భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి స్త్రీ ని అక్కగా, తల్లి గా , చెల్లి గానే భావించాలి అని శాస్త్రం చెబుతోంది. భోజనం చేసేటప్పుడు  శబ్దం లేకుండా మాట్లాడకుండా భోజనం చేయాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: