భారత జట్టు మాజీ ఓపెనర్.. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో హీరో గా నిలిచిన ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఈ ఏడాది యూఏఈ లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో ప్లే ఆఫ్ చేరుకున్న జట్లపై... వాటికీ నాయకత్వం వహిస్తున్న వారిపై స్పందించాడు. తాజాగా గౌతమ్ గంభీర్ ప్లే ఆఫ్స్ కు చేరుకున్న 4 జట్ల కెప్టెన్స్ పనితీరుపై మాట్లాడాడు. మొదటి ధోని గురించి మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని బెస్ట్ కెప్టెన్ అని అన్నాడు. ధోని ఒత్తిడిని ఎంతో బాగా హ్యాండిల్ చేయగలరని.. కెప్టెన్సీలో ధోని నెంబర్ వన్ అని అన్నాడు.

ఆ తర్వాత ఢిల్లీ కెప్టెన్ పంత్ గురించి మాట్లాడుతూ... జట్టులో ఎంతో మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్న పంత్ కు కెప్టెన్ గా అవకాశం వచ్చింది.. అయితే ఆ సీనియర్ ఆటగాళ్లు అందరూ పంత్ కు తోడుగా ఉన్నారు. అది కలిసి వచ్చే అంశం. ఇక ఈ రోజు ఈ రెండు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్లో ఢిల్లీ ఫేవరెట్ అని కామెంట్ చేశాడు.

ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని పొగిడాడు గౌతమ్ గంభీర్. కెప్టెన్ గా తన బాధ్యతలను కోహ్లీ అద్భుతంగా నిర్వర్తించాడు అని గంభీర్ అన్నాడు. అయితే ఇదే ఆఖరి సీజన్ కావడంతో కోహ్లీ ప్రశాంతంగా ఉన్నాడని... ఆ కారణంగానే అతను తన అత్యుత్తమ ప్రదర్శన చేయగలిగాడని పేర్కొన్నాడు. అలాగే ఈ ఏడాది బెంగళూరు జట్టులో బౌలర్లు రాణించడం వారికి కలిసి వచ్చే అంశం అని అన్నాడు.

చివరగా తాను కెప్టెన్ గా రెండు సార్లు టైటిల్ అందించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు గురించి మాట్లాడుతూ... దానికి నాయకత్వం వహిస్తున్న మోర్గాన్ కెప్టెన్ గా ఏమీ చేయడం లేదని... ఆ జట్టు వీడియో అనాలసిస్ వెనక ఉండి జట్టును నడిపిస్తున్నాడని... ప్లేస్ కు చేరుకోవడానికి కూడా అతనే కారణమని అన్నాడు. మైదానంలో ఉన్నప్పుడు మోర్గాన్ ఎప్పుడు కెప్టెన్ గా వ్యవహరించడం లేదని.. బహుశా మైదానం బయట కెప్టెన్ గా ఉంటున్నాడు కావచ్చు అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: