ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియం లో ఐపీఎల్ సీజన్ 15 లో భాగంగా ముంబై మరియు చెన్నై జట్ల మధ్యన మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ ఒక ప్రాక్టీస్ అని చెప్పాలి. ఇరు జట్లలో ఏది గెలిచినా ఏది ఓడినా పెద్దగా ఒరిగిదేమీ లేదు. అయినా ఇప్పటికే పోయిన్ట్ల పట్టికలో అట్టడుగున ఆన్న ముంబై మాత్రం కనీసం ఉత్తమ మైన స్థానంతో టోర్నీని ముగించాలన్న ఆశతో గెలిచేందుకు సమాయత్తం అయింది. ఇదిలా ఉంటే మొదట టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్ లో చెన్నై గత మ్యాచ్ లో ఆడిన జట్టునే కొనసాగించడం విశేషం. ఎప్పటిలాగే చెన్నై ఇన్నింగ్స్ ను కాన్ వే మరియు గైక్వాడ్ లు ఆరంభించారు.

ఈ టోర్నీలో కాన్ వే అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. గత మూడు మ్యాచ్ లలోనూ వరుసగా అర్ద సెంచరీలు సాధించి చెన్నై గెలుపులో కీలక పాత్ర వహించాడు. ముంబై కూడా ఇతన్ని అవుట్ చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే అని ఫీల్ అవుతూ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. అయితే అనుకున్నట్లే ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండవ బంతికి సామ్స్ బౌలింగ్ లో కాన్ వే ఎల్బీడబ్ల్యు గా వెనుతిరిగాడు. అయితే యంపైర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం మాములుగా ఉండేది. కానీ వాంఖడే స్టేడియం లో ఆ సమయానికి కరెంటు లేకపోవడం మూలంగా డి ఆర్ ఎస్ ను ఉపయోగించేందుకు బీసీసీఐకి అవకాశం లేకుండా పోయింది.

ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో అసంతృప్తిగా కాన్ వే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దీనితో మ్యాచ్ విన్నర్ ఎటూ కాకుండా అవుట్ అవ్వడం చెన్నై అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. నిజంగా ఈ విధంగా జరగడం బహుశా ఇదే మొదటి సారి కావొచ్చు. దానితో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కు కూడా కరెంటు తో కష్టాలు తప్పలేదు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: