దీంతో షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యలపై స్పందించిన టీమిండియా క్రికెటర్ అమిత్ మిశ్రా అతని పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఇటీవలే కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది. దేశ ద్రోహానికి పాల్పడ్డాడు అంటూ అతని పై వచ్చిన అభియోగాలు మొత్తం నిజం అని తేలడంతో జీవితకాల శిక్ష తో పాటు పది లక్షలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక అంతకుముందు యాసిన్ మాలిక్ వ్యవహారంతో పాటు కాశ్మీర్ అంశంపై అఫ్రిది ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
భారత్ లో మానవ హక్కుల మీద గొంతెత్తిన వారి గొంతు నొక్కడం ఇంకా కొనసాగుతూనే ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. యాసిన్ మాలిక్ మీద నేరం మోపినంత మాత్రాన కాశ్మీర్ కోసం చేసే పోరు ఆగేది కాదు. కాశ్మీరీ లీడర్ల మీద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఐక్యరాజ్యసమితి కోరుతున్నా అంటూ ట్వీట్ చేయగా... దీనిపై స్పందించిన అమిత్ మిశ్రా డియర్ షాహిద్ ఆఫ్రిది యాసిన్ మాలిక్ స్వయంగా నేరాన్ని అంగీకరించాడు. అందరూ నీలాగా బర్త్ డేట్ తప్పు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించరు కదా అంటు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.