ఈ క్రమంలోనే ఇక చివరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన సమయం లో అప్పటికే ఐర్లాండ్ బ్యాట్స్మెన్లు ఉన్న దూకుడుకి ఇక ఈ 16 పరుగులు పెద్ద కష్టం ఏమి కాదు.. ఐలాండ్ విజయం సాధించడం ఖాయం అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. అలాంటి సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఎలాంటి అనుభవం లేని ఉమ్రాన్ మాలిక్ చేతికి బంతి అప్పగించాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారిపోయింది అని చెప్పాలి. చివరికి స్పీడ్ బౌలింగ్ తో ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ లకు చెమటలు పట్టించిన ఉమ్రాన్ ఏకంగా 12 పరుగులకే కట్టడి చేశాడు.
దీంతో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్‌కు బౌలింగ్ ఇవ్వడం పై స్పందించిన హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిని అధిగమించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అన్న విషయం పై మాత్రమే దృష్టి సారించా.. ఉమ్రాన్ మాలిక్ పై నమ్మకం ఉంచా. ఎందుకంటే అతని బౌలింగ్ లో ఫేస్ ఉంది. అతని పేస్ లో 16 పరుగులు సాధించడం కాస్త కష్టమే. అందుకే అతనికి చివరి ఓవర్లో బంతిని అప్పగించాను. తర్వాత ఉమ్రాన్ మాలిక్ తన పేస్ తో బ్యాట్స్మెన్లను కట్టడి చేసేందుకు ప్రయత్నించాడు అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.