ఐర్లాండ్ పర్యటనలో భాగంగా ఇటీవలే జరిగిన రెండో టీ-20 మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏకంగా 225 పరుగులు చేసింది. దీంతో పసికూన ఐర్లాండ్ ముందు భారీ టార్గెట్ ను ఉద్దేశించింది. దీంతో ఎంతో అలవోకగా భారత్కు విజయం వరిస్తుంది అని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో ఐర్లాండ్ బ్యాట్స్మెన్లు విరుచుకుపడ్డారు అని చెప్పాలి. సిక్సర్లు ఫోర్ లతో   చెలరేగిపోయి అటు భారత బౌలర్లపై ఆధిపత్యాన్ని సాధించారు ఐర్లాండ్ బ్యాట్స్మెన్లు.


 ఈ క్రమంలోనే ఇక చివరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన సమయం లో అప్పటికే ఐర్లాండ్  బ్యాట్స్మెన్లు ఉన్న దూకుడుకి ఇక ఈ 16 పరుగులు పెద్ద కష్టం ఏమి  కాదు.. ఐలాండ్ విజయం సాధించడం ఖాయం అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. అలాంటి సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఎలాంటి అనుభవం లేని ఉమ్రాన్ మాలిక్ చేతికి బంతి అప్పగించాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారిపోయింది అని చెప్పాలి. చివరికి స్పీడ్ బౌలింగ్ తో ఐర్లాండ్ బ్యాట్స్ మెన్ లకు చెమటలు పట్టించిన ఉమ్రాన్ ఏకంగా 12 పరుగులకే కట్టడి చేశాడు.


 దీంతో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.  చివరి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్కు బౌలింగ్ ఇవ్వడం పై స్పందించిన హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిని అధిగమించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అన్న విషయం పై మాత్రమే దృష్టి సారించా.. ఉమ్రాన్ మాలిక్ పై నమ్మకం ఉంచా. ఎందుకంటే అతని బౌలింగ్ లో ఫేస్ ఉంది. అతని పేస్ లో 16 పరుగులు సాధించడం కాస్త కష్టమే. అందుకే అతనికి చివరి ఓవర్లో బంతిని అప్పగించాను. తర్వాత ఉమ్రాన్ మాలిక్ తన పేస్ తో  బ్యాట్స్మెన్లను కట్టడి చేసేందుకు ప్రయత్నించాడు అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: