గత కొంత కాలం నుంచి టీమిండియా జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. బ్యాటింగ్ విభాగంలో బౌలింగ్ విభాగంలో తమకు తిరుగులేదు అని నిరూపిస్తుంది. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని సాధిస్తుంది. ఈ క్రమంలోనే వరుస పర్యటనలతో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వరుసగా రెండు సిరీస్ లలో విజయం సాధించిన టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో కూడా అదే జోరు కొనసాగించింది.


 రెండు సిరీస్ లలో విజయం సాధించింది. ఇక ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో కూడా మూడు వన్డేలసిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది అని చెప్పాలి. ఇలా ప్రస్తుత కాలంలో టీమిండియా వరుస విజయాలకు కళ్లెం వేసే జట్టు కనిపించకుండా పోయింది అని చెప్పాలి. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన అనంతరం టీమిండియా ఒక వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఒకే ఏడాదిలో అత్యధిక వన్డే సిరీస్ లను వైట్ వాష్ చేసిన జట్టుగా భారత్ ఒక అరుదైన ఘనత సాధించింది.


ఈ ఏడాది అద్భుతమైన ఫామ్ లో దూసుకుపోతున్న టీమిండియా ఇప్పటివరకు మూడు వన్డే సిరీస్ను వైట్ వాష్ చేసింది. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన నేపథ్యంలో ఈ ఘనత సాధించింది టీమిండియా.  అంతకుముందు రెండు వన్డే సిరీస్లను వెస్టిండీస్ పై వైట్వాష్ చేసింది అని చెప్పాలి. అయితే భారత్ తర్వాత స్థానంలో న్యూజిలాండ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి.  ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ మూడు జట్లు 2 వన్డే సిరీస్ లను మాత్రమే క్లీన్స్వీప్ చేయడం గమనార్హం. అయితే ఇటీవలే జింబాబ్వే పర్యటన లో భాగంగా కేఎల్ రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: