టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ పేరు వింటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా ఏదో తెలియని ఆసక్తి వస్తూ ఉంటుంది. ఇక ఇతను మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు అంతే చాలు క్రికెట్ ప్రేక్షకులందరూ లో కూడా ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. మైదానం లో ఉన్నది కొంత సేపు అయిన పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటాడు హార్దిక్ పాండ్యా. బౌలింగ్ లో బ్యాటింగ్లో ఫీల్డింగ్ లో ఎక్కడ ఎవరికీ తీసిపోని విధంగా ఆటతీరుతో అదరగొడుతు ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే హార్దిక్ పాండ్యాను అమితంగా అభిమానిస్తూ ఉంటారు ఇండియన్ క్రికెట్ ప్రేక్షకులు.


 ఇకపోతే గాయాల బారినపడి జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత టీమిండియా లోకి వచ్చి అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రదర్శన చేస్తున్నాడు. బౌలింగ్లో బ్యాటింగ్ లో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి  మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందిస్తున్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవలే సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో కూడా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తో విధ్వంసమే సృష్టించాడు అని చెప్పాలి.



 ఆస్ట్రేలియా బౌలర్లపై వీరవిహారం చేసి కేవలం 30 బంతుల్లో 71 పరుగులతో చెలరేగిపోయాడు. ఈక్రమంలోనే హార్దిక్ పాండ్య బ్యాటింగ్ తీరుపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసలు కురిపించాడు. తనదైన రోజున మ్యాచ్ ను గెలిపించగల సత్తా హార్దిక్ పాండ్య దగ్గర ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అతడిలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది అంతే కాదు అతని పై అతనికి నమ్మకం ఎక్కువ 4వ స్థానంలో వచ్చి అద్భుతంగా ఆడుతున్నాడు. అతనిలో ఉన్న ఆత్మవిశ్వాసమే అతని ఉన్నతికి కారణం. ఇక ఒత్తిడిని కూడా ఎంతో అలవోకగా అధిగమిస్తాడు అంటూ మాథ్యూ హేడెన్  ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: