సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గత కొన్ని సీజన్ల నుంచి మాత్రం ఎందుకో అభిమానుల అంచనాలను అందుకోలేక నిరాశ పరుస్తూ ఉంది. అదే సమయంలో ఇక తరచూ జట్టు కెప్టెన్లను మారుస్తూ అభిమానులు అందరిని కూడా కన్ఫ్యూజన్లో పడేస్తుంది. గతంలో ఒకసారి జట్టుకు టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ను కెప్టెన్ గా మాత్రమే కాకుండా జట్టు నుంచి తప్పించింది. ఇక మొన్నటికీ మొన్న గత ఏడాది జరిగిన మినీ వేలం సమయంలో ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ సారథిగా పేరు సంపాదించుకున్న కేన్ విలియమ్సన్ ను సారధ్య బాధ్యతల  నుంచి తప్పించింది సన్రైజర్స్ యాజమాన్యం.


 ఈ క్రమంలోనే ఇక సన్రైజర్స్ జట్టు కొత్త కెప్టెన్సి చేపట్టబోయేది ఎవరు అన్న విషయంపై తీవ్రమైన చర్చ జరగకగా.. ఇటీవల క్లారిటీ వచ్చింది. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ కెప్టెన్ గా జట్టును గెలిపించి టైటిల్ అందించిన ఐడెం మార్కరమ్ కే ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను  కూడా అప్పగించింది యాజమాన్యం. ఇక అతనికి కెప్టెన్సీలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవడం లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో సన్రైజర్స్ జట్టుకి ఊహించని షాక్ తగలబోతోంది అన్నది తెలుస్తుంది.


 జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన ఐడెం మార్కరమ్ ఇక ఇప్పుడు ఐపీఎల్ కు దూరం కాబోతున్నాడు అన్న వార్త అభిమానులందరినీ కూడా ఆందోళనలో ముంచేస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ సమయంలోనే అటు సౌత్ ఆఫ్రికా జట్టు నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ లో ఆడుతున్న సౌత్ఆఫ్రికా ప్లేయర్ లందరూ కూడా ఐపీఎల్ కి బదులు ఇక సొంత దేశ జట్టు తరఫున ఆడే ఛాన్స్ ఉంది.


 ఇక ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న ఐడెం మార్కరమ్ సైతం ఐపీఎల్ ను కాదని ఇక సొంత దేశం జట్టు తరఫున ఆడుబోతున్నాడు. దీనిబట్టి చూస్తే ఇక సన్రైజర్స్ కి  మార్కరమ్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే మాత్రం ప్రస్తుతం సన్రైజర్స్ జట్టు వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న భువనేశ్వర్ జట్టు కెప్టెన్సీ చేపట్టే ఛాన్స్ ఉంది. దీంతో ఏం జరగబోతుందో కూడా అర్థం కాని విధంగా సన్రైజర్స్ అభిమానులు అందరూ కూడా కన్ఫ్యూజన్లో మునిగిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: