ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గా తనను తాను చెప్పుకునే చంద్రబాబునాయుడు ఇంట్లోనే కూర్చుని ఏమి చేస్తున్నాడు ? ఇపుడిదే అందరికీ తొలిచేస్తున్న ప్రశ్న. లాక్ డౌన్ ప్రకటనకు ముందు చినబాబుతో సహా హైదరాబాద్  చేరుకున్న చంద్రబాబు దాదాపు నెల రోజులుగా భాగ్యనగరంలోనే ఉండిపోయాడు. ఇక్కడ కూర్చుని ఏపిలో జగన్మోహన్ రెడ్డి పాలనపై చిత్ర, విచిత్రమైన నిరాధార ఆరోపణలు చేస్తున్నాడు. సరే రాజకీయ నేతలన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే అనుకోండి అది వేరే సంగతి.

 

కానీ ఇంట్లోనే కూర్చుని చంద్రబాబు ఏమి చేస్తున్నట్లు ?  పార్టీ నేతల సమాచారం ప్రకారం ఉదయం లేచింది మొదలు చంద్రబాబు ఓ షెడ్యూల్ వేసుకున్నాడట.  కరోనా వైరస్ గురించి, వ్యాప్తి నియంత్రణ గురించి పెద్ద శాస్త్రవేత్తో లేకపోతే నిపుణుడో చెప్పినట్లుగా చాలా విషయాలు మాట్లాడేస్తున్నాడు. ప్రతిరోజు వేలామంది నేతలతో టెలిఫోన్ కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నాడు. దాదాపు రెండు గంటల సేపు కాన్ఫరెన్సుతోనే సమయం అయిపోతోంది. నిజానికి చంద్రబాబు టెలికాన్ఫరెన్సుపై ఆసక్తి చూపే నేతల సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టచ్చు.

 

ఎందుకంటే రోజు ఉదయమే రెండు గంటల పాటు చంద్రబాబు సోది వినే ఓపికి, అసక్తి ఎవరుకుంటుంది ?  పైగా చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతుంటాడు. తెల్లవారి లేస్తే జగన్మోహన్ రెడ్డి మీద చేసే ఆరోపణలు వినాలంటే ఎంతమందికి ఇంట్రస్టుంటుంది ?  ఆ తర్వాత వైద్యులతోనో మరోకరితోను దాదాపు రెండు గంటలసేపు  వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తాడు. కరోనా వైరస్ గురించి వీళ్ళతో ఫీడ్ బ్యాక్  తీసుకుని  మళ్ళీ కొందరు సీనియర్ నేతలతో  ఓ గంట మాట్లాడుతాడు. అప్పటికి మధ్యాహ్నం దాటిపోతుంది. తర్వాత కాసేపు మనవడు దేవాన్ష్ తో ఆటలాడుకుంటాడు.

 

తర్వాత సాయంత్రమయ్యేసరికి మీడియాతో ఆన్ లైన్లో దాదాపు గంటకుపైగా ప్రెస్ మీట్ నిర్వహిస్తాడు.  మీడియా సమావేశం తర్వాత మళ్ళీ మూడో రౌండు నేతలతో చివరగా ఓ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తే నిర్వహిస్తాడు లేకపోతే కుటుంబసభ్యులతో సమావేశమవుతాడు. లేదా తనతో మాట్లాడుదామని ఫోన్ చేసే వాళ్ళతో కాసేపు మాట్లాడుతాడు. సరే మొత్తానికి రాత్రవుతుంది భోజనం చేసి పడుకుంటాడు.

 

పార్టీ నేతలు చెప్పిన సమాచారం ప్రకారం ప్రతిరోజు దాదాపు ఇలాగే ఉంటుంది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దినచర్య. ప్రతిరోజు నేతల బుర్ర తినే బదులు తెలంగాణా సిఎం కేసియార్ తో మాట్లాడుకుని కరోనా వైరస్ బాధిత ప్రాంతాల్లో తన నేతలు, శ్రేణులను తరలించి సేవా కార్యక్రమాలు చేయవచ్చు కదాని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు లేండి.  కానీ సేవా కార్యక్రమాల్లోకి దిగితే మరి జగన్ పై ఆరోపణలు చేసేందుకు సమయం ఉండదు కదా అందుకనే సేవా కార్యక్రమాలపై ఆలోచిస్తున్నట్లు లేడు.

మరింత సమాచారం తెలుసుకోండి: