
చంద్రబాబును కుప్పం కూడా పట్టించుకోవడం లేదు..
తప్పు కాదు కానీ ఆయన చేసిన గర్జన కారణంగా
కుప్పంలో అభివృద్ధి పనులు ఏమయినా మొదలవుతుండాయా?
లేదా జగన్ పట్టించుకోని కారణంగానే చంద్రబాబుకు
రోజురోజుకూ కోపం పెరిగి పోతాండాదా?
అన్న ఎన్టీఆర్ తనని తాను సింహంతో పోల్చుకున్నారు.అది తప్పు కాకపోయినా ఆ..రోజు ఆ..రాజకీయం చెల్లింది కూడా! తరువాత ఆయన సింహ గర్జన పేరిట తెగ హడావుడి చేశారు కూడా! అలాంటి గర్జనకు కాలం చెల్లి చాలా కాలం అయింది.చెల్లుబాటులో లేని గర్జనల కారణంగా రాజకీయ పార్టీలకు కొత్తగా పేరు రాదు సరికదా ఉన్న పేరు కూడా ఊడుతుంది.పరువొచ్చి గంగలో కలిసి
పోతుంది.అప్పుడు ఏ వచ్చి బీ పై వాలే,బీ వచ్చి సీ పై వాలే అని హుషారు గీతాలేవీ మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వవు.
ఎవ్వరూ
బాగుండేది.ఇవేవీ కాకుండా కుప్పంలో ఉన్న ప్రజా సమస్యలు కాకుండా పొత్తుల గురించి లవ్ స్టోరీలు వినిపించడమే విచిత్రం.
ఆ విధంగా అల్లుడి రోడ్ షో లో చేసిన గర్జనను జగన్ పట్టించుకోకపోవడంలో వింత లేదు మరియు విడ్డూరం కూడా లేదు.