హిందు స‌నాత ధ‌ర్మంలో అనేక ఆచారాలు, వ్య‌వ‌హారాలు అనాధిగా కొన‌సాగుతూ వ‌స్తున్నాయి. అయితే, ఈ ఆచారాలు ఏదో విధంగా సైన్స్‌కు రిలేట్ అయి ఉంటూ వ‌స్తున్నాయి. ఈ ఆచారాల్లో మొల‌తాడు క‌ట్టుకోవ‌డం కూడా ఒక‌టి. చాలామంది చిన్న‌వ‌య‌సు నుంచే మొల‌తాడును క‌ట్టుకుంటారు. కానీ, ఇప్పుడు చాలా మంది ఫ్యాష‌న్‌కు పోయి మొల‌తాడ‌ను ధ‌రించ‌డం లేదు. అయితే, మొల‌తాడు క‌ట్టుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయ‌ని, దాన్ని త‌ప్ప‌కుండా ధ‌రించాల‌ని పెద్ద‌లు చెబుతూ ఉంటారు. కొంద‌రికి మొల‌తాడు ధ‌రించ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు తెలియ‌కున్నా ఆచారం కాబ‌ట్టి క‌ట్టుకుంటారు. అయితే, మొల‌తాడు ధ‌రించ‌డం ద్వారా ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ ప‌రంగా కూడా ప్ర‌యోజనాలు క‌లుతాయో చూద్దాం.


   న‌ల్ల మొల‌తాడును ఎక్కువమంది క‌ట్టుకుంటారు. దీని వ‌ల్ల దుష్ట‌శ‌క్తులు త‌మపై ప్ర‌భావం చూప‌ద‌ని న‌మ్మ‌తారు. అలాగే నెగెటివ్ ఎన‌ర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. వీటి కార‌ణంగా అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా, దిష్టి త‌గ‌ల‌కుండా నివారిస్తుంది. ఇప్పుడు సాంకేతిక అందుబాటులో ఉంది కాబ‌ట్టి ఏ చిన్న అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చినా ఆస్ప‌త్రుల‌కు వెళ్తున్నాం. కానీ, పూర్వ‌కాలంలో అసలు ఆస్ప‌త్రులే లేవు అలాంటి స‌మ‌యంలో మ‌న చుట్టూ ఉండే ఆకులు, ప‌స‌రుల‌తో వైద్య చికిత్స చేసేవారు. ఒక‌వేళ పాము, తేలు క‌రిస్తే వెంట‌నే శ‌రీరం పై ఉన్న మొల‌తాడును తీసి క‌ట్టి విషం తీసేవారు.


   మొల‌తాడు క‌ట్టుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగ‌ప‌డి బ‌రువును అదుపులో ఉంచుతుంది. బాన‌పొట్ట రాకుండా మొల‌తాడు ధ‌రించాల‌ని చెబుతుంటారు. అలాగే హెర్నియా రాకుండా, వెన్నెముక‌కు స‌పోర్ట్‌గా మొల‌తాడు ఉంటుంది. దీన్ని క‌ట్టుకోవ‌డం వ‌ల్ల జ‌న‌నావ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంట‌య‌ని చెబుతారు. అందుకోస‌మే కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు కూడా మొల‌తాడు వేసుకుంటారు. చిన్న‌పిల్ల‌ల‌కు అంద‌రికీ మొల‌తాడు క‌డుతారు. పూర్వ కాలంలో మ‌గాళ్లు బెల్టులు పెట్టుకునే వాళ్లు కాదు దీనివ‌ల్ల కింద ద‌రించే వ‌స్త్రాలు జారిపోతాయ‌ని మొల‌తాడును బెల్టుగా వాడుకునే వారు. పూర్వ‌కాలంలో బొడ్డు తాడుకు ప‌స‌రు మందులు రాసి ఒక రేకులో తాయ‌త్తు లాగా చేసి మొల‌తాడుకు క‌ట్టేవాళ్లు. దీంతో ఆ వ్య‌క్తికి భ‌విష్య‌త్తులో ఏమైన స‌మ‌స్య‌లు వ‌స్తే బొడ్డు తాడులోని మూల‌క‌ణాల‌ను తీసి చికిత్స చేసేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: