తెలుగు సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా సినిమాలలో కమెడియన్స్ కి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ప్రేక్షకుల చేత మంచి ఆదరణ పొందడమే కాకుండా, ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నైజం వీరిది. అలాంటి వారిలో కమెడియన్ మల్లికార్జునరావు గారు కూడా ఒకరు. ఈయన రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పించారు. అంతేకాకుండా స్టార్ హీరోల సరసన కూడా నటించి అందరిని మన్ననలు పొందారు. ఇక ఈయన గురించి మనం పూర్తి విశేషాలు తెలుసుకుందాం..

ఈయన పూర్తి పేరు పీలా కాశీ మల్లికార్జునరావు. 1960 అక్టోబర్ 10వ తేదీన అనకాపల్లిలో జన్మించారు. మొదట రంగస్థల నటుడిగా అడుగు పెట్టి, ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ లోకి అరంగేట్రం చేశారు. రంగస్థల నటుడిగా భమిడిపాటి రాధాకృష్ణ గారు రాసిన" లెక్కలు తెచ్చిన చిక్కులు" అనే నాటకం ద్వారా తన నటనను చూపించాడు. అంతేకాకుండా పలుకే బంగారమాయే నాటకంలో కూడా నిర్మాత వేషం వేయడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది అనకాపల్లిలోనే ఏ ఎమ్ వీ ఎమ్ ఆస్పత్రిలో కొద్దిరోజులు ఉద్యోగం కూడా చేశారు. ఇక అక్కడే ట్రేడ్ యూనియన్ కి నాయకత్వం కూడా వహించారు.

ఈయనకు భార్య ,ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన నటనకు మెచ్చిన రావు గోపాల్ రావు మల్లికార్జున రావు గారిని చిత్రసీమకి పరిచయం చేశారు. అలా 1972 లో మొదటిసారి తులసి అనే చిత్రంలో చిన్న వేషం వేశారు. ఆతర్వాత పార్వతీ పరమేశ్వరులు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసి , తన సినీ జీవితాన్ని మొదలుపెట్టారు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నటించిన తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు లభించగా ,రఘుపతి వెంకయ్య బంగారు పతకం కూడా లభించింది.

ఆ తర్వాత రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీలో సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేయగా, ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఇక ఎన్నో సాధించిన ఈయన తన 57 సంవత్సరాల వయసులో 2008 జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) వ్యాధితో తుదిశ్వాస విడిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: