మణివన్నన్ తమిళ్ నటుడు మాత్రమే కాదు, తెలుగులో కూడా పలు సినిమాలను నటించి , తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడు, దర్శకుడు మాత్రమే కాదు ఉద్యమకారుడు కూడా. 1985 సంవత్సరంలో 1982 సంవత్సరం వరకు ఆయన ప్రముఖ దర్శకుడు భారతీరాజా దగ్గర రచయితగా పనిచేశాడు. ఆ తరువాత ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసి ,ఆ తర్వాత దర్శకుడిగా మారి ఒక ప్రత్యేక స్థానాన్ని రూపొందించుకున్నాడు. అలా దాదాపు 50 చిత్రాలకు పైగా అద్భుతంగా దర్శకత్వం వహించి, అప్పట్లోనే స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు మణివన్నన్.

ఆ తర్వాత మూడు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో సుమారు 400 చిత్రాలకు పైగా నటించి, ఒక మంచి గుర్తింపు పొందిన నటుడు. ముఖ్యంగా హాస్యనటుడిగా, నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతినాయకుడిగా కూడా పలు సినిమాలలో నటించాడు. ఇక ఈయన 1953 జూలై 31వ తేదీన మద్రాసు లో సులూర్ అనే గ్రామంలో జన్మించాడు. ఇక విద్యాభ్యాసం తన సొంత ఊర్లో ఉన్న గవర్నమెంట్ బాలుర హై స్కూల్ లో పూర్తి చేశాడు. ఇక ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో చేరి, చదువుతున్న సమయంలో అక్కడ సత్యరాజ్ తో పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత రాజకీయాల్లో కూడా మద్దతుదారుడిగా నిలిచాడు  డీఎంకే ,అన్నాడీఎంకే పార్టీ లకు మద్దతు ఇచ్చాడు. ఇక అంతే కాదు నక్సలైట్ ఉద్యమంలో కూడా కార్యకర్తగా పని చేశాడు. ఈయన విద్యాభ్యాసం అయిన తర్వాత వస్త్ర వ్యాపారిగా అలాగే బియ్యం వ్యాపారి గా  కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈయన సెంగమలం అనే ఆవిడ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు, కుమార్తె కూడా ఉన్నారు. ఈయన కొడుకు రఘు వన్నన్ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. చివరిసారిగా తన నివాసంలో 2013 జూన్ 15వ తేదీన 59 సంవత్సరాలు ఉన్నప్పుడు మరణించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: