చిరంజీవి సర్జా.. ఈయన ప్రముఖ కన్నడ నటుడు.. నటించింది కొంత కాలమే అయినా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక నటుడు చిరంజీవి సర్జా. ఈయన 1984 సంవత్సరం అక్టోబర్ 16 వ తేదీన కర్నాటకలోని బెంగళూరులో జన్మించాడు. ఇక వీరి తల్లిదండ్రులు అమ్మాజీ, విజయ్ కుమార్. చిరంజీవి సర్జా తల్లి యొక్క తాతగారైన శక్తి ప్రసాద్, అలాగే చిరంజీవి సర్జా మామగారు అర్జున్ సర్జా , సోదరుడు ధృవ సర్జా కూడా సినీ ఇండస్ట్రీలో నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక మరొక మామ కిషోర్ సర్జా కూడా సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి.


ఇక స్కూలు విద్య అంతా బాల్డ్విన్ బాలుర ఉన్నత పాఠశాలలో కంప్లీట్ చేశాడు. ఇక విజయ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఇక తన మేనమామ అయినటువంటి అర్జున్ సర్జా తో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా చిరంజీవి సర్జా పనిచేశాడు. ఇక తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అతని మరొక మేనమామ అయిన కిషోర్ సర్జా దర్శకత్వంలో వచ్చిన వాయుపుత్ర అనే సినిమాతో 2009లో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా ఇన్నోవేటివ్ ఫిల్మ్ అవార్డు కూడా లభించింది.

అక్టోబర్ 2017 సంవత్సరంలో మరొక నటి అయిన మేఘన రాజ్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. 2018 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన క్రైస్తవ మత పరంగా పెళ్లి జరిగింది. తర్వాత 2018 మే రెండవ తేదీన హిందూ సాంప్రదాయ ప్రకారం ప్యాలెస్ గ్రౌండ్ లో కూడా వివాహం చేసుకోవడం గమనార్హం. 2020 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. 11 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 20 సినిమాలు తీశాడు. చివరిసారిగా శ్వాస సంబంధిత వ్యాధి రావడంతో నిద్రలోనే 2020 సంవత్సరం జూన్ 6వ తేదీన కన్నుమూశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: