ఆంద్రప్రదేశ్ లో ఉన్న విశిష్టమైన దేవాలయాల్లో శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవాలయం ఒకటి. ఇది కర్నూల్ జిల్లాలో ఉన్న శ్రీశైల పట్టణంలో నిలయమై ఉన్నది. ఈ దేవాలయం పరమ పవిత్రమైనది మరియు చాలా పురాతనమైన దేవాలయం. శ్రీశైలంలో జన సాంద్రత చాలా తక్కువ. మన సంప్రదాయాలను సంస్కృతిని అద్దం పట్టే ఈ ప్రదేశం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.