చాలా సందర్భాలలో మనం శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే మాట వింటూనే ఉంటాం. ఈ మాటలో చాలా పరమార్థం ఉంది. మనల్ని చీమ వచ్చి కుట్టినపుడు మనం ఆ చీమ జీవం పోవటానికి కారణమవుతాం. ఆ సమయానికి చీమ యొక్క ఆయుష్షు కూడా తీరుతుంది. చీమ ఆయుష్షు తీరాలి కాబట్టి ఆ పని చేసింది. అదే నీ అంతట నువ్వు వెళ్లి పుట్టలో కాలు పెట్టి శివుడాజ్ఞ అని చెబితే మాత్రం చీమలు కుట్టికుట్టి చంపేస్తాయి. 
 
మనం ఏ పని చేసినా ఆ పని మన కర్మ కిందకు వస్తుంది. కానీ శివుని సంకల్పం ఉంటే నువ్వు చేయాలి అనుకున్నా చేయకూడదు అనుకున్నా ఆ పని అలానే జరిగి తీరుతుంది. ఈ సృష్టిలో చీమ నుండి బ్రహ్మ వరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటాయి. సృష్టిలోని అణువణువూ, సమస్త విశ్వమూ శివమయమే. జ్ఞానులు శివం కానిది 'శవ 'మంటారు. శివుడిని అతిక్రమించి ఈ ప్రపంచంలో ఏదీ కూడా జరగదు. 
 
ఈ సృష్టిని ఏర్పరచింది, సంరక్షిస్తుంది శివుడే అని శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టుదని అంటారు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్ట దిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు శివుడే అధిపతి. శివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషం కూడా మనల్ని పట్టి పీడించదు. సోమవారం శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు శివుడిని పూజించటం ద్వారా అష్టైశ్వర్యాలు కలగటంతో పాటు దారిద్ర్యం, సమస్యలు తొలగిపోతాయి. వేకువజామున శివుడిని పూజించటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: