దేశంలో అత్యంత విశిష్టమైన పండుగల్లో విజయదశమి ఒకటి. ముఖ్యంగా నవరాత్రులకు ఎంతో ప్రత్యేక స్థానముంది. 9 రోజుల పాటు నిర్వహించే ఈ నవరాత్రుల్లో దుర్గామాతను ఒక్కో రోజు ఒక్కో రూపంలో పూజిస్తారు. ఈ ఏడాది నవరాత్రుల ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవరాత్రి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దుర్గామాత విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలో తెలుసా? ఎందుకంటే మీరు ఇంట్లో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్టించవచ్చు. అయితే సరైన దిశలో ఉంచడం ముఖ్యం. వాస్తుశాస్త్రంలో దీనికి సంబంధించిన వివరాలున్నాయి.

వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి దేవతకు వారికిష్టమైన దిశలు ఉంటాయి. అందువల్ల వారిని ఆయా దిక్కుల్లోనే పూజించాలి. దేవత లేదా దేవత యొక్క విగ్రహం ఏ దిశలో ఉండాలి.. భక్తులు ఏ దిశలో ఉండాలి లేదా ఆరాధించాలి అని గ్రంథాలలో వివరంగా ప్రస్తావించారు. దుర్గాదేవిని పడమర లేదా ఉత్తరం దిశలో ఉండాలి. కాబట్టి భక్తులు వారిని ఆరాధించేటప్పుడు దక్షిణ లేదా తూర్పుకు అభిముఖంగా ఉండాలి. ఈ రెండు దిశలనే దేవతకు ప్రియమైందిగా భావిస్తారు. తూర్పు లేదా దక్షిణ దిక్కుల్లో అభిముఖంగా కూర్చోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. తూర్పుకు అభిముఖంగా ఆరాధించడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. దక్షిణ దిశ వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇలా చేయడం ద్వారా దేవుడికి నేరుగా కనెక్ట్ అవుతారని నమ్ముతారు.

వాస్తుశాస్త్రం ప్రకారం పూజమందిరంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్టున్నట్లయితే స్వస్తిక్ ను వెలుపల భాగంలో పసుపు లేదా సింధూరం గుర్తించేలా చూసుకోండి. భవానీ విగ్రహాన్ని గుర్తించినప్పుడల్లా అది పెద్దదిగా ఉండకూడదని గుర్తించుకోండి. మూడంగుళాల కంటే పెద్ద విగ్రహం ఇంట్లో ఉండకూడదు. అలాగే విగ్రహం రంగు, పూజగది రంగు లేత పసుపు, ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉంచాలి. ఇది సానుకూల శక్తిని సృష్టిస్తుంది. ఇదే సమయంలో కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: