మాములుగా ఒక నెలలో ఖచ్చితంగా మూడు శనివారాలు లేదా ఒక్కోసారి అయిదు శనివారాలు వస్తుంటాయి. అయితే ప్రతి నెలలో వచ్చే చివరి శనివారానికి చాలా శక్తి ఉందని పండితులు చెబుతుంటారు. ఈరోజున కొన్ని వస్తువులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఎందుకు అలా చేయకూడదు. ఒకవేళ చేస్తే ఏమి జరుగుతుంది. ఇలా ఎన్నో ప్రశ్నలు మీ మదిలో ఉంటాయి కదా..అయితే ఇప్పుడే తెలుసుకుందాము. మాములుగా మనము నెల మొదటి వారంలో శుభాలు జరుగుతాయని బలంగా నమ్ముతాము.

ఈ శుభ కార్యక్రమాలలో ముఖ్యంగా మీరు ఉద్యోగస్తులైతే జీతాలు వస్తాయి. అంతే కాకుండా చాలా మంది ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మొదలు తేదీనే ప్రారంభిస్తారు. ఆ;లా అయితేనే వ్యాపారం వృద్ధిలోకి వస్తుందని నమ్మకం. ఈ విధంగా ప్రతి నెలలో మొదటి రోజుల్లో పాజిటివ్ గా ఉంటుందని అనుకుంటాము. అలాగే నెలలో చివరి రోజులు నెగటివ్ గా అనిపిస్తాయి. ముఖ్యమైన పనులు చేయడానికి ఈ చివరి రోజులను ఎవరూ ఎంచుకోరు. మరీ నెలలో వచ్చే చివరి శనివారం ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రభావం తర్వాతి నెలపై పడకుండా జాగ్రత్త పాడడం చాలా ముఖ్యం.

ఇకపోతే నెల చివరి శనివారంలో నల్లని షూస్ మరియు నల్లటి బట్టలు కూడా కొనవద్దు.  ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. దీని వలన మనము నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి తెచ్చినవారవుతాము. నెగటివ్ ఎనర్జీ మనతో ఉంది అంటే ఇక మనము ఏ పని తలపెట్టినా జరగదు. నెలాఖరున చివరి శనివారం రోజున ఎలక్ట్రానిక్ వస్తువులు, పరికరాలూ కొనకండి. వాటి ద్వారా నెగెటివ్ ఎనర్జీ ప్రవహించే ప్రమాదం ఉంటుంది.గొడుగు అస్సలు కొనవద్దు. గొడుగులకు ఎనర్జీని లాక్కునే శక్తి ఉంటుంది.కొత్త వాహనం కొనాలనుకుంటే కూడా చివరి శనివారం కొనవద్దు. కాబట్టి జాగ్రతగా ఇవన్నీ గుర్తించుకుని పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: