ఆ భగవంతుడైన శ్రీ కృష్ణుడు తాను చెప్పిన భగవద్గీతలో ఎన్నో విషయాలను మానవ జాతికి ఉపయోగపడే వాటిని తెలియచేశారు. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఏదైనా ఒక కర్మను మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఏర్పడిన మనఃప్రవృత్తినే 'సంస్కారం' అంటారు. చాలా కాలం గారాబం చేయడం వల్ల మనపై ఆసక్తిని పెంచుకొని మనల్ని అంటిపెట్టుకొనుండే పెంపుడు కుక్కల లాంటివే ఈ సంస్కారాలు. అకస్మాత్తుగా ఒక రోజు వీటన్నింటినీ వదిలి వెళ్లాలంటే కుదరని పని. ఇవి మనల్ని సమీపిం చిననాడు వాటిపై దాడి చేసి దూరంగా తరిమి వేయాలి.

కాబట్టి ముందుగా ఏమి చేయాలంటే మన చెడు సంస్కారాల గురించి తెలుసుకుని ఉండాలి. అప్పుడు అవి ఎలా మనకు సంగ్రహిస్తున్నాయో ఆ పరిస్థితుల నుండి తప్పించుకోవాలి. కానీ మన ముందున్న ఆ సుడి గుండం గురించి మనకు తెలిసి ఉన్నప్పడు, దాని నుంచి తప్పించు కోవాలన్న కోరిక దృఢంగా ఉన్నప్పడు దాని దరిదాపులకు కూడా పోకూడదు. అయితే కేవలం కళ్ళు మూసుకుంటే సరిపోదు. మన అంతరాళం నుంచే ఈ చెడు సంస్కారాలను ఎదుర్కోవడమనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. యోగసూత్రాల సృష్టికర్త అయిన పతంజలి మహర్షి చెప్పినట్లు ఈ చెడు సంస్కారాలను మరింత లోతైన స్థాయిలో పరిష్కరించేందుకు వాటికి వ్యతిరేకమైన మంచి సంస్కారాలపై మనసును ఏకాగ్రపరచడమే మార్గం.

మంచి సంస్కారాలకు నిదర్శనాలైన వ్యక్తుల పైన లేదా విషయాల పైన మనస్సును లగ్నం చేయవచ్చు. కానీ భగవంతునిపై దృఢవిశ్వాసమున్న వ్యక్తి విషయంలోనైతే ప్రార్థన, ధ్యానం లాంటివి సాధన చేస్తూ దేవునితో మమేకమవడం ఉత్తమం. పాపప్రవృత్తి నుంచి బయటపడేందుకు భగవద్గీత ఇలా మార్గం చూపుతోంది. మన మనస్సులోని ప్రతిచర్యలపై దృష్టి పెడుతూ కేవలం సాక్షిగా వాటిని గమనించడం ద్వారా వాటి ప్రభావం నుంచి బయట పడగలుగుతాం. కాబట్టి మన ఇంద్రియాలు ఒక భోగవస్తువు, మాయలో పడకుండా వాటిని బయట నుంచి పరిశీలించ గలిగినప్పడు వివేకం చూపగలిగినప్పడు మనలోని భావాన్ని లేదా సంస్కారాన్ని జయించగలుగుతాం.

మరింత సమాచారం తెలుసుకోండి: