మన చరిత్రలో యుగాలు నాలుగు అని చెప్పబడింది. నాలుగో యుగంలో ప్రపంచం అంతం అవుతుందని...మరలా మొదటి యుగం కొత్తగా ప్రారంభం అవుతుందని కూడా చెప్పబడింది. అయితే ఇప్పుడు  మనం నాలుగో యుగం అనగా కలియుగంలో ఉన్నాం.  అంటే అంతరించిపోయే నాలుగో యుగంలో, అయితే కలియుగం ఎప్పుడు అంతరిస్తుందో అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే మన పురాణ కథలలో బ్రహ్మవైవర్త పురాణంలో కలియుగం అంతం గురించి గంగా దేవి కృష్ణుడిని అడుగుగా..అపుడు ఆ కృష్ణ భగవానుడు ఏమాన్నరంటే ? కలియుగం అంటేనే తగాదాల యుగం, వివాదాల యుగం , క్రూరమైన యుగం అని అర్థం అంటూ సంబోధించారు. క్రోదుడు అనే క్రూర రాక్షసుడు అతని సోదరి హింస అనే అన్న చెల్లెళ్ళకు ప్రకృతి విరుద్ధంగా వివాహం జరుగగా జన్మించినవాడు కలి. అందుకే అతనికి మంచి, చెడులు లేవు, నీతి, జాతి లేదు. సామాజిక కట్టుబాట్లను, సంస్కృతిని నాశనం చేసి ప్రపంచ ధర్మాన్ని అతిక్రమించిన నీచమైన జంట నుండి పుట్టిన వాడు కలి. 

అయితే ప్రతి యుగంలోనూ చెడును అంతం చేయడానికి భగవంతుడు ఎదో ఒక అవతారంలో వెంటనే వచ్చి సంహరిస్తాడు. కానీ కలియుగంలో అలా రాడు కారణం. చతుర్యుగాలను తిరిగి మొదటి నుండి అంటే సత్య యుగం నుండి ప్రారంభించడానికి కలియుగాన్ని పూర్తి స్థాయిలో అంతమొందించాల్సి ఉంది. ఎందుకనగా మొదటి మూడు యుగాల్లో రాక్షసులు వారి వారి రూపాల్లో ఉంటూ ప్రపంచంపై విరుచుకుపడే వారు. కావున దేవుడు ఆ రక్షకుడిని నేరుగా అంతం చేయగలిగే వారు. అయితే కలియుగంలో కలి రాక్షసుడు అధర్మం, అజ్ఞానం, పాపం, హింస, పైశాచికత్వం అను పలు చెడు రూపాల్లో మానవులందరిలోను దాగి ఉన్నాడు. భగవంతుడు కలియుగంలో చెడుని పూర్తిగా అంతం చేయాలి అంటే ఈ ప్రపంచాన్నే అంతం చేయాల్సి ఉంటుంది. అందుకు సమయం రావాల్సి ఉంది.   అన్ని పుణ్య తీర్థములు భూమిని వదలి నా చెంతకు అనగా వైకుంఠానికి చేరుతాయి. భక్తులు, సాధువులు, శాస్త్రములు,  వైష్ణవుల పురాణములు, శ్రాద్ధ తర్పణములు , దైవ పూజలు భగవంతుని స్మరణలు, సర్వ  వేదములు,  ధర్మములు గ్రామదేవతలు ఇలా అన్నీ పుణ్య తీర్థములు భూమిపై క్రమంగా తగ్గి వైకుంఠానికి చేరుకుంటాయి. అపుడు పూర్తిగా అధర్మంతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని అంతం చేయడానికి నేను వస్తాను.

ఇక కలియుగం మొత్తం  కాలము  నాలుగు లక్షల ముప్పైరెండువేల  సంవత్సరాలు ఉంటుంది. ఇప్పటికీ కలియుగం వచ్చి ఎంత కాలం అయింది అంటే ఇప్పటికీ మనం కేవలం ఐదువేల సంవత్సరాలు దాటాము. అంటే కలియుగం పూర్తి కాలంలో మనం అనుభవించింది చాలా స్వల్పంగా ఇంకా కలి యుగం అంతం కావడానికి చాలా సమయం ఉంది. అప్పటికి మానవులు పూర్తిగా అసత్యాలు పలికే వారుగా మారిపోతారు, సంప్రదాయాలు, గుళ్ళు, ఆచార వ్యవహారాలు ఉండవు, నీతి అనేదే ఉండదు, బంధాలు బాంధవ్యాలు విడిచి క్రూరంగా నీచంగా ప్రవర్తిస్తారు. కలియుగం అంతం అయ్యే సమయంలో విష్ణువు కల్కి రూపం దాల్చి ఈ ప్రపంచాన్ని అంతం చేస్తారు. అప్పుడు భూమి జలమయం అయ్యి తిరిగి కొంతకాలం తర్వాత కృత యుగం అంటే ద్వాపర  యుగంతో మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: