దైవం ఉన్నారా లేదా అనే విషయంపై ఎప్పుడు ఏదో ఒక చర్చనీయాంశం జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా వీటిపై కొన్ని సినిమాలు కూడా రావడం జరిగింది. ఈ ప్రశ్నలు సామాన్యుల దగ్గర నుండి మహా మహా మేధావులు సైతం ఈ ప్రశ్నలు వేధిస్తూనే ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే మనం గురువారం రోజున ఇలా చేస్తే దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చట.

వారంలో గురువారం రోజున శ్రీమహావిష్ణువుకు చాలా ఇష్టమైన దినము. అందుకే తన ఆ రోజున విష్ణువును ప్రార్ధించి నట్లయితే లక్ష్మీ దేవి కూడా అనుగ్రహం వస్తుంది అని నమ్మకం. ఇక విష్ణువుకి ఇష్టమైన వస్తువు పసుపు. గురువారం రోజున ఉపవాసం ఉండి దేవుడిని పసుపుతో పూజించినట్లయితే.. దేవుడు కరుణిస్తాడని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. గురువారం రోజున పశుపును ఉపయోగించడం వల్ల, ఎలాంటి లాభాలు కలుగుతాయి ఒకసారి చూద్దాం.

శుభకార్యానికి ఎక్కువగా ఈ పసుపు ని వాడుతారు. గురువారం రోజున శుభకార్యానికి వెళ్తున్నట్లుయితే.. గణపతికి పసుపు తిలకాన్ని దిద్దడం వల్ల, అంతా మంచే జరుగుతుందట. అలా దిద్దిన బొట్టునే మనం కూడా పెట్టుకున్నట్లు అయితే.. మీరు చేపట్టిన కార్యక్రమం అంతా సజావుగా సాగుతుంది.

పసుపు దానం ఇవ్వడం వల్ల, దేవతల గురువైన బృహస్పతిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. గురువారం రోజున బ్రాహ్మణులకు శనగపప్పు, పసుపురంగులో కలిగిన వస్త్రాలు ఇవ్వడం వల్ల అంతా మంచే జరుగుతుందట.

పసుపు అక్షింతలు ఉపయోగించడం వల్ల, మన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ అక్షింతలను తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పాటించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చుట. ఇక అంతే కాకుండా మీరు అనుకున్న కార్యక్రమం పూర్తవుతుందట.

వైవాహిక జీవితంలో కలతలు రాకుండా ఉండాలంటే.. గురువారం రోజు స్నానం చేసేటప్పుడు పసుపును పట్టించుకోని చేయడం వల్ల, జీవితం అంతా సంతోషంగా ఉంటుందని కొంతమంది పండితులు  తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: