మహాశివరాత్రి రోజున  మనకి ఎక్కువగా వినిపించే పదం ఉపవాసం. అయితే ఈ పర్వదినాన జాగరణ చేస్తూ ఉపవాసం ఉంటే మంచి జరుగుతుందని అందరు నమ్ముతుంటారు.  మరి ఉపవాసం ఎవరు చేయాలి ఎలా చేయాలి.. అనేది తెలుసుకుందాం..! ముఖ్యంగా ఉపవాస దీక్ష అనేది చిన్నపిల్లలకి, వృద్ధులకు అవసరం లేదు. మధ్యవయసులో ఉన్నటువంటి యువకులు కానీ, కాస్త వయసు ఎక్కువ ఉన్న వారు కానీ చేయాలి చేస్తాను అన్న శక్తి ఉన్నవారు మాత్రమే ఈ యొక్క ఉపవాసాన్ని చేయాలి. అయితే ఇందులో చాలామంది ఉపవాస దీక్ష అంటే కనీసం మంచినీళ్లు కూడా ముట్టకుండా కటిక ఉపవాస దీక్షను చేయడం వలన అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉపవాసం అంటేనే భగవంతునికి సమీపంలో ఉండటం. కాబట్టి అహర్నిశలు స్వామివారిని జపం చేస్తూ పండ్లు  కానీ, పాలు కానీ, లేదా అల్పాహారం కానీ, తినవచ్చు. అంతే తప్ప శివరాత్రి కదా అని కటిక ఉపవాస దీక్ష చేసి మరునాడు ఉదయం అనారోగ్యం బారిన పడి డాక్టరు చూపించుకోవడం మంచిది కాదు.

 ముఖ్యంగా భగవంతుడు ఏం చెప్తాడు అంటే  ఎవరైతే తనను తలుచుకుంటూ ఉంటారో వారంతా దీక్ష ఇచ్చే స్థితిలోనే ఉంటారట. ఆయన అసలే బోళా శంకరుడు, మీరు పొద్దున్నే లేచి స్నానమాచరించి కొన్ని పళ్ళు, పాలు బోలా శంకరుడికి నైవేద్యంగా సమర్పించి వాటిని మీరు ఆహారంగా తీసుకోండి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు. మీకు ముఖ్యంగా మధుమేహం, బిపి, డయాబెటిక్ లాంటి  అనారోగ్యం ఉన్నవారు చక్కగా అల్పాహారం చేసుకొని మాత్రం తినాలి. మరి అన్నం ఎందుకు తినకూడదు అంటే, అన్నం తింటే బ్రెయిన్ కు ఆక్సిజన్ లెవెల్ తగ్గగానే చాలా నిద్ర వస్తుంది. అలసటగా తయారవుతుంది. ఇక వారు భగవంతుని ఆరాధన ఏ విధంగా చేస్తారు. అందుకే ఈ ఒక్క రోజైనా అన్నం తినకుండా అల్పాహారం తిని స్వామివారిని తలుచుకుంటూ ఉపవాస దీక్ష చేయడం మంచిది. రాత్రి జాగరణ చేయలేని వాళ్ళు రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలంలో శివ నామస్మరణ చేసి సమీపంలోని ఎక్కడైనా గుళ్లో కానీ లేదా ఇంట్లో కానీ కొన్ని స్తోత్రాలను పెట్టుకొని కాసేపు విని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని స్వామివారికి దండం పెట్టుకొని వెళ్లి పడుకోవచ్చు. ఈ విధంగా మనం నిష్టతో 12 గంటల రాత్రి వరకు మేలుకున్న కానీ జాగరణ చేసినదాని కిందికే వస్తుంది. ఏది ఏమైనా ఆరోగ్యంగా ఉండటం కోసం మనం నిత్యం ఏదైతే చేస్తూ ఉంటామో అలాగే చేస్తూ తన భక్తిని చాటాలని పలువురు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: