హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి కేటాయిస్తూ పూజలు చేసుకుంటూ ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా సోమవారం మహా శివుడికి మంగళవారం ఆంజనేయ స్వామి , సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్పెషల్ గా పూజలు చేస్తూ ఉంటారు.  అయితే చాలామంది తమ వర్క్ బిజీ షెడ్యూల్స్ లో పడి దేవుడికి పూజలు చేయడం తగ్గించేస్తూ ఉంటారు. మనసులో దేవుడిపై అపారమైన నమ్మకం ఉన్నా కానీ వర్క్ కాల్ షీట్స్ బిజీగా ఉన్న కారణంగా ఉదయం పరుగు పరుగున లేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటారు తప్పిస్తే గుడికి వెళ్లి దండం పెట్టుకునే అంత టైం కూడా ఉండదు.  అలాంటి వాళ్ళు హాలిడే దొరికితేనే గుడికి వెళ్లి దండం పెట్టుకొని దేవుడిని దర్శించుకుంటూ ఉంటారు.

మిగతా సమయాలలో అస్సలు వాళ్ళకి తీరిక ఉండదు . అలాంటి వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాలలో బాధపడిపోతూ కూడా ఉంటారు . మనం గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవడం లేదు ఆ కారణంగానే ఇంట్లో ఇలాంటి చికాకులు ఉన్నాయా ..?? అంటూ అనుకునే జనాలు కూడా ఉన్నారు. కానీ అలా అంతా ఏమీ ఉండదు అంటున్నారు పండితులు . దేవుడిని దర్శించుకోవడం మంచిదే కానీ మనం దేవుడిని దర్శించుకోలేని సమయంలో మనం వాళ్ళని స్మరించుకుంటూ ఉంటుంటే ఆ లోటు మనకు కనిపించదు అంటున్నారు జ్యోతిష్య పండితులు.

మరీ ముఖ్యంగా ఆంజనేయ స్వామికి నియమనిష్ఠలతో పూజలు చేయాలి అని అంత అంటూ ఉంటారు . మైలు ఆంజనేయ స్వామికి తగలనే తగలకూడదు అని చాలామంది పండితులు కూడా చెబుతూ ఉంటారు . కాగా ఆంజనేయ స్వామికి ఆకు పూజ అంటే చాలా చాలా ఇష్టం.  తమలపాకుతో మాల చేసి పూజ చేయిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని .. ఏ ప్రాబ్లమ్స్ కారణంగా బాధపడుతున్నారో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి అని ఎంతో మంది చెబుతూ ఉంటారు . ఒకవేళ అలా చేయలేని వాళ్ళు ..ఆ సమయం కూడా లేని వాళ్ళు ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన హనుమాన్ చాలీసా  చదివితే మాత్రం ఇంట్లో తెలియని పాజిటివ్ ఎనర్జీతో పాటు .. మనసు కి చాలా చాలా హాయిగా ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు .

ఎవరైతే ఉద్యోగ మరియు ఇతర ఇతర కారణాల చేత గుడికి వెళ్లి దేవుని దర్శించుకోలేకపోయారు. అలాంటివారు మంగళవారం పూట ఇంట్లోనే ధూపం వేసుకొని ఇంట్లో ఈశాన్యం మూల లేదా పూజ మందిరం ముందు పీట వేసుకొని కూర్చొని హనుమాన్ చాలీసా చదివితే మాత్రం చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందట.  కొంతమంది చదవడానికి రాదు అలాంటి వాళ్ళు హనుమాన్ చాలీసాని విన్నా కూడా పుణ్యం అంటున్నారు జ్యోతిష్య పండితులు . అంతే కాదు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది . ఈ హనుమాన్ చాలీసా చదివితే అంటూ ఎప్పటినుంచో జనాలు నమ్ముతున్నారు..!! 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం ఓ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎంతవరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయం అన్నది గుర్తు ఉంచుకోండి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: