నేడే నాగపంచమి . శ్రావణమాసంలో 5వ రోజు అంటే శుద్ధపంచమి రోజున వచ్చేదే ఈ నాగపంచమి . ఈ నాగపంచమిని చాలా చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు భక్తులు . ఈ ఏడాది నాగపంచమి పండుగ జూలై 29వ తేదీ మంగళవారం వచ్చింది . సాధారణంగా మంగళవారానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. పైగా ఈసారి నాగపంచమి మంగళవారం రావడం మరింత శుభప్రదం అని పండితులు అంటున్నారు.  ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు పూజకు శుభ సమయం. ఈ నాగపంచమి రోజు చాలామంది జంట నాగమ్మలకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు .


జాతకంలో నాగదోషాలు ..కాలసర్ప దోషాలు ఉంటే జీవితం దుర్బలం అవుతుంది . ఏ పని సాఫీగా సాగదు . ఆ కారణంగానే కొంతమందికి వివాహం ఆలస్యం అవుతుంది . ఉద్యోగాలు రావు . సంతానం కలగడం ఆలస్యం అవుతుంది . కనుక ఎవరైతే అలాంటి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు నాగపంచమి రోజున చేసే పూజలతో ఎలాంటి నాగదోషాలైనా తొలగిపోతాయి అంటూ జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ నాగపంచమి నాడు కొన్ని కొన్ని పనులు అస్సలు చేయకూడదు . మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఈ నాగపంచమి నాడు దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

 

అంతేకాదు మాంసాహారాలు ముట్టకూడదు. ఇంట్లో ఎటువంటి గొడవలు పడకూడదు . అరుపులతో ఆడవాళ్లు కన్నీళ్లు పెట్టుకోకూడదు. అంతేకాదు నాగపంచమి రోజు ఇంట్లో ఏ వస్తువు కూడా పగలకూడదు.  మరీ ముఖ్యంగా ఉదయం సాయంత్రం దీపం పెట్టుకొని ధూపం వేసుకోవాలి. ఆడవాళ్లు నవ్వుతూ సంతోషంగా ఇంట్లో తిరుగుతూ ఉండాలి . బూతు మాటలు తప్పుడు మాటలు నోటి నుంచి రాకూడదు . అలా నియమనిష్ఠలతో నాగపంచమి జరుపుకుంటే ఎటువంటి దోషాలైన తొలగిపోతాయి అని ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న అవన్నీ సర్దుమణిగిపోతాయి అంటూ పండితులు చెప్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: