విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో ఇండియా మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ తర్వాత దక్షిణాఫ్రికాతో ఆడుతున్న మొదటి సిరీస్ ఇది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా ముందంజలో ఉంది. నాలుగో రోజు ఆట చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో  రెండు అద్భుతాలు చోటు చేసుకున్నాయి.


హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మొదటి ఇన్నింగ్స్ లో సూపర్ పర్ ఫార్మెన్స్ తో సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అప్పటి వరకు తనపై వస్తున విమర్శలకు తన బ్యాట్ ద్వారానే సమాధానం ఇచ్చాడు. అయితే అతని ఆట మొదటి ఇన్నింగ్స్ వరకే పరిమితం కాలేదు. రెండవ ఇన్నింగ్స్ లోనూ  అదే హవా కొనసాగించి మరో సెంచరీ పూర్తి చేశాడు. 


ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు చేసిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పడమే కాకుండా ఓపెనర్ గా వచ్చి రెండు సెంచరీలతో పాటు అత్యధిక పరుగులు తీసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ తో నెలకొల్పిన రికార్డ్ కంటే అందరి దృష్టిని బాగా ఆకర్షించిన అంశం మరోటి ఉంది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో ఒకే తరహాలో రోహిత్ ఔట్ అవడం ఆశ్చర్యానికి గురి చేసింది.


తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ మహరాజ్‌ బౌలింగ్‌ ముందుకొచ్చి ఆడబోయిన రోహిత్‌, రెండో ఇన్నింగ్స్‌లో అతని బౌలింగ్‌ లోనే ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి ఔట్ అయ్యాడు. ఈ  రెండు సందర్భాల్లోనూ వికెట్‌ కీపర్‌ డీకాక్‌ ఎటువంటి తప్పిదం చేయకుండా స్టంప్‌ ఔట్‌ చేశాడు. ఈ విధంగా ఆటలో  రెండు అద్భుతాలు చోటుచేసుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: