టీమిండియాలో స్టార్ బౌలర్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు జస్ప్రిత్ బూమ్రా. ఒక టీమిండియాలో కాదు ప్రపంచ మేటి బౌలర్లలో జస్ప్రిత్ బూమ్రా మొదటి వరుసలో ఉంటాడు. 26 ఏళ్ళ జస్ప్రిత్ బూమ్రా తన బౌలింగ్  తో అద్భుతమైన యాక్షన్ తో అన్ని ఫార్మాట్లలో రాణిస్తూ... ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది  అభిమానులను సంపాదించుకున్నారు. బుల్లెట్ల లాంటి  బంతులు విసురుతూ... ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లకు చుక్కలు చూపించడం లో జస్ప్రిత్ బూమ్రా సిద్ధహస్తుడు అనే చెప్పాలి. భారత విజయాలలో ఎప్పుడు కీలక పాత్ర పోషిస్తూ... అద్భుతమైన బౌలింగ్ తో దూసుకుపోతున్నాడు. ఏ ఫార్మాట్ లో నైనా.. ఎలాంటి ప్రత్యర్థి తో నైనా..తనదైన  బౌలింగ్ తో  మ్యాచ్ను విజయతీరాలకు నడిపిస్తాడు. 

 


 అందుకే టీమిండియాలో జస్ప్రిత్ బూమ్రా ఎంతో కీలకంగా మారిపోయాడు. అంతే కాదు మొన్న ప్రకటించిన గ్రేడ్ లలో కూడా విరాట్ కోహ్లితో పాటు ఏ ప్లస్ గ్రేడ్  సొంతం చేసుకున్నాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ అందరికంటే చాలా సపరేట్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. బుమ్రా బౌలింగ్ యాక్షన్ ట్రై చేస్తే మాత్రం కాస్త ఇబ్బందే. ఎందుకంటే తనదైన స్టైల్ తో బౌలింగ్  చేస్తూ ఉంటాడు జస్ప్రిత్ బూమ్రా. అయితే ప్రపంచవ్యాప్తంగా జస్ప్రీత్ బూమ్రాకు అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్కు చెందిన ఓ కుర్రాడు అచ్చం జస్ప్రిత్ బూమ్రా బౌలింగ్ యాక్షన్ తో బౌలింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో ఆ కుర్రాడు అచ్చం బుమ్రా  మాదిరిగానే బంతుల్ని పట్టుకొని స్లో రన్ అప్ తో  వేసాడు. ఆ కుర్రాడు అలా బౌలింగ్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టైరిస్  ... ఆ కుర్రాడి  బౌలింగ్ను వీడియో తీసి ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.

 


 ఇక అక్కడ బౌలింగ్ చేసిన కుర్రాడిని  పిలిచి అచ్చం టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా లాగె  బౌలింగ్ వేస్తున్నావ్ అంటూ  అభినందించాడు. మీరు ఈ వీడియోపై ఒక లుక్కేస్తే నిజంగా బూమ్రా లాగానే చేసినట్లుగా అనిపిస్తుంది. మామూలుగా అయితే ఎవరికైనా బూమ్రా యాక్షన్ తో  బౌలింగ్ చేయడం చాలా కష్టం కానీ ఈ కుర్రాడు మాత్రం చాలా సులువుగా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ ను పట్టేసి డిట్టో   దింపేశాడు. ఇది చూసిన నెటిజన్లు అందరూ  మరో బూమ్రా వచ్చేసాడు అంటూ కామెంట్లు  పెడుతున్నారు. సేమ్ టు సేమ్ బుమ్రా లాగే  బౌలింగ్ చేసావే అంటూ రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: