అంతర్జాతీయ క్రికెట్ లో జట్టు రాణించాలి అంటే బ్యాటింగ్ విభాగం బౌలింగ్, విభాగంలో చాలా బలంగా ఉండాలి. బౌలింగ్ పక్కన పెట్టి బ్యాటింగ్ విషయానికి వస్తే... వన్డేల్లో అయినా టెస్టుల్లో అయినా ఏ ఫార్మాట్ లో అయినా సరే నాలుగో స్థానం అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇటు టాప్ ఆర్డర్ ని అటు మిడిల్ ఆర్డర్ ని సమన్వయం చేస్తూ సాగుతుంది నాలుగో స్థానం. ఈ స్థానంలో బలంగా లేకపోతే మాత్రం జట్టు ఓటమి ఖాయమని అంటూ ఉంటారు. 

 

ఓపెనర్లు ఎంత బాగా ఆడినా సరే మహా అంటే 30 ఓవర్ల వరకు ఉంటారు. మూడో స్థానంలో వచ్చే ఆటగాడు, నాలుగో స్థానంలో వచ్చే ఆటగాడు ఇద్దరూ కూడా బ్యాటింగ్ కి వెన్నుముఖ అనేది వాస్తవం. ముఖ్యంగా నాలుగో స్థానం ఎంత బలంగా ఉంటే అంత మంచిది. ఇండియా విషయానికి వస్తే ద్రావిడ్, యువరాజ్ తప్పుకున్న తర్వాత నాలుగో స్థానం విషయంలో టీం ఇండియా చాన్నాళ్ళ పాటు ఇబ్బంది పడింది అనేది వాస్తవం. 

 

ఆ తర్వాత చాలా మంది ఆటగాళ్ళు, అంబటి రాయుడు, రిషబ్ పంత్, దినేష్ కార్తిక్, కేదార్ జాదవ్ లాంటి ఎందరో ఆటగాళ్లను పరీక్షించారు. కాని నాలుగో స్థానంకి మాత్రం సరిగా సరిపోయాడు యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్. కివీస్ పర్యటన ద్వారా ఇదే విషయాన్ని అయ్యర్ స్పష్టంగా చెప్పాడు. పొట్టి ఫార్మాట్ తో పాటుగా వన్డే ఫార్మాట్ లో కూడా కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. దీనితో జట్టు ఓటమి పాలైనా సరే మూడు వన్డేల్లో కూడా మంచి స్కోర్ సాధించింది. ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో జట్టుని ఎంతగానో ఆదుకున్నాడు అతడు.

మరింత సమాచారం తెలుసుకోండి: