ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్ ఈరోజునుండి న్యూజిలాండ్ తో టేస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే న్యూజిలాండ్ తో టీ20 వన్డే సిరీస్ లను ఆడింది   భారత్. అయితే ఈ టి20 సిరీస్ లో భారత్ తన సత్తా చాటి అద్భుతంగా రాణించింది.  ఏకంగా న్యూజిలాండ్ దేశంలో  న్యూజిలాండ్ జట్టును క్లీన్స్వీప్ చేసింది భారత్. ఇక ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్  లో పేలవ ప్రదర్శన చేసి కివీస్ కి సిరీస్ కట్టబెట్టింది .  న్యూజిలాండ్ జట్టులో అనుభవంగల ఆటగాడు... రాస్ టేలర్. ఇన్నింగ్స్ ఏదైనా ఫార్మాట్ ఏదైనా..  మెరుపులు మెరిపిస్తు ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు  విషయం తెలిసిందే. తన అనుభవాన్నంతా ఉపయోగించి... అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం భారత్తో జరిగిన మ్యాచ్ లో నే కాదు ఇప్పటివరకు న్యూజిలాండ్ ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ప్రతి విజయంలో తన అనుభవాన్ని ఉపయోగించి విజయతీరాల వైపు నడిపించాడు. 

 

 

 రాస్ టేలర్  మైదానంలో కుదురుకొని ఆడితే ఎంతో  అద్భుత ప్రదర్శన చేసాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఎవరు ఆడలేనన్ని  మ్యాచులు ఆడాడు రాస్ టైలర్. దిగ్గజ క్రికెటర్ లకు కూడా సాధ్యం కాని కొన్ని రికార్డులను నెలకొల్పాడు. తనదైన అద్భుత ఇన్నింగ్స్ లతో ఎన్నో సంచలన రికార్డు సాధించాడు. అంతే కాకుండా న్యూజిలాండ్ జట్టులోనే ఎంతో సీనియర్ అయిన ఆటగాడు రాస్ టేలర్ . ఎన్నోసార్లు ఆటతో  అద్భుతాన్ని  సృష్టించాడు. 

 


 ఇకపోతే తాజాగా న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రోస్ టేలర్  అరుదైన రికార్డును నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ తో  ఆడుతున్న టెస్ట్ మ్యాచ్తో... ఇప్పుడు వరకు ఏకంగా 100 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. దీంతో ప్రపంచంలోనే ఏ  ఆటగాడు సాధించనీ  రికార్డును సృష్టించాడు. వన్డే టి20 టెస్ట్ ఇలా అన్ని ఫార్మాట్లలో వంద మ్యాచ్  ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు రాస్ టైలర్. ప్రపంచంలో ఏ క్రికెటర్ కూడా ఈ రికార్డును సృష్టించ లేదు  ఇప్పటివరకు. కాగా రాస్ టేలర్  ఇప్పటివరకు 7154 పరుగులు చేయగా అందులో 19 సెంచరీలు 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంతటి  అనుభవం గల ఆటగాడు తన అనుభవాన్ని ఉపయోగించి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: