ఐపీఎల్ పోరు  ఎంతో రసవత్తరంగా మారిపోయింది. మొన్నటి వరకు వరుస పరాజయాలతో సతమతమైన జట్లు ప్రస్తుతం ప్లే ఆప్ కి అర్హత సాధించడానికి ఎట్టిపరిస్థితిలో విజయం సాధించాలని ముందుకు సాగుతున్న క్రమంలో అన్ని జట్లు  ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గత వారం వరకు వరుస పరాజయాలతో ఐపీఎల్ పాయింట్ల పట్టిక లో చివరి స్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఇప్పుడు మాత్రం ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది... వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుసగా ఏకంగా హ్యాట్రిక్ విజయాలతో మళ్లీ ప్లే ఆఫ్ పోటీలో నిలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.



 అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా మళ్లీ గెలుపు బాట పట్టి ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. దీంతో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తప్ప మిగితా అన్ని జట్లు కూడా ప్లే ఆఫ్ రేసులో ప్రస్తుత పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే పంజాబ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టిక లో 5వ స్థానానికి ఎగబాకింది. ఇక ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడేందుకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కు అవకాశం ఉంది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం అన్ని జట్లు ప్లే ఆఫ్ చేరుకునేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో లీగ్  దశ ముగిసేసరికి ఏ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలుస్తాయి అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఓకేనా మొన్నటివరకు పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న పంజాబ్ ప్రస్తుతం 5వ స్థానానికి ఎగబాకడం  ఆసక్తికరంగా మారింది. ఇక పంజాబ్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లో విజయం సాధించగా సన్రైజర్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లో కూడా పరాజయం పాలైంది. సన్రైజర్స్ ఇలాగే కొనసాగితే ప్లే ఆఫ్  అవకాశాలు పూర్తిగా సన్నగిల్లే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: