ఐపీఎల్ సీజన్ లో టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటినుంచి అంచనాలకు తగ్గట్టుగా ఆడటం లేదు అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ నుంచి పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగించింది  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ముందు సీజన్లలో బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది సీజన్లో మాత్రం అంతలా ప్రభావం చూపలేకపోయింది అనే చెప్పాలి. దీంతో వరుస  ఓటమి చవి చూస్తూ పాయింట్ల పట్టికలో చివరికి చేరిపోయింది. కానీ ప్రస్తుతం ప్లే ఆఫ్  అవకాశాలను సజీవంగా ఉంచుకునేందుకు హోరాహోరీగా పోరాటం చేస్తుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.



 దీంతో అటు అభిమానులు అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ సీజన్ లో దిగ్గజ జట్లుగా కొనసాగుతున్న జట్లను  సైతం ఓడిస్తూ అద్భుత ప్రదర్శన చేస్తోంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. మొన్నటివరకు పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న జట్టు ప్రస్తుతం ఊహించని రీతిలో విజయాలు అందుకుంటుంది. అయితే నిన్న హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బర్త్ డే  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ బర్త్ డే కి జట్టు అసలుసిసలైన బర్త్ డే  గిఫ్ట్ ఇచ్చింది.



 ఢిల్లీ క్యాపిటల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ విభాగంలో పూర్తి ఆధిపత్యం సాధించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇక ఆ తర్వాత బౌలింగ్ విభాగంలో కూడా పూర్తిగా ఆధిపత్యం సంపాదించి  ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సీజన్లో మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా 88 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించి తమ జట్టు సారథి డేవిడ్ వార్నర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఇక దీంతో ఇదే డేవిడ్ బాయ్ బర్త్ డే కి అసలు సిసలైన గిఫ్ట్ అని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: