దాదాపు గత రెండేళ్ల నుంచి సుదీర్ఘ కాలంగా మంచి ఫామ్ లో కొనసాగుతూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు కేఎల్ రాహుల్. ఒక మంచి టెక్నికల్ బ్యాట్స్మెన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత ఒత్తిడిలో అయినా  ఎంతో అద్భుతంగా  భారీ స్కోర్ చేయగల సత్తా తనకు ఉంది అని ఎన్నోసార్లు నిరూపించాడు కె.ఎల్.రాహుల్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి గురికాకుండా ఎంతో కూల్ గా  బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ శైలి ఎప్పుడు ప్రేక్షకులందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో అద్భుతమైన షార్ట్స్ ఆడుతూ ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు కె.ఎల్.రాహుల్.



 ఇక ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఐపీఎల్ సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్గా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్న విషయం తెలిసిందే మొదట కాస్త తడబడినప్పటికీ ఆ తర్వాత మాత్రం పంజాబ్ ను  సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు కేఎల్ రాహుల్. వరుసగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐదు విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు..



 ఇదిలా ఉంటే భారత ఆటగాళ్లందరూ ఐపీఎల్ టోర్నీ పూర్తవ్వగానే అటు నుంచి అటే ఆస్ట్రేలియా టూర్ వెళ్తున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా ఈ ఆస్ట్రేలియా టూర్కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ కు వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ దక్కింది. ఆస్ట్రేలియా టూర్ లో అన్ని ఫార్మాట్లకు కె.ఎల్.రాహుల్ ఎంపికయ్యాడు అయితే వన్డే టి20 ఫార్మాట్లకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు కె.ఎల్.రాహుల్. దీనిపై స్పందించిన కె.ఎల్.రాహుల్.. తనకు వైస్ కెప్టెన్ గా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది ఇది నా దృష్టిలో గర్వించదగ్గ విషయం.. వైస్ కెప్టెన్ అవుతానని ఊహించలేదు తన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: