నిన్న రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల  మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించింది. ఎందుకంటే అటు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్మెన్స్  ఇటు పంజాబ్ బ్యాట్స్మెన్లు కూడా సిక్సర్ల  కురిపించారు. బౌలర్లను  తెగ ఇబ్బంది పెట్టేసారు. అయితే నిన్న జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 185 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అయితే పంజాబ్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న క్రిస్ గేల్ ఒక విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 41 ఏళ్ల వయసులో కూడా భారీగా సిక్సర్లు బాదుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.



 కానీ సెంచరీకి ఒక్క పరుగుకు ముందు వికెట్ కోల్పోయాడు క్రిస్ గేల్. 20 ఓవర్ లో  క్రిస్ గేల్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్న సమయంలో... జొఫ్రా  ఆర్చర్  వేసిన బంతికివికెట్ సమర్పించుకున్న క్రిస్ గేల్ ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీనిపై అటు క్రిస్ గేల్ కూడా బాగా ఫీల్ అయిన విషయం తెలిసిందే. అయితే సెంచరీ కొడతానని ముందే సహచరులకు చెప్పి బరిలోకి దిగిన క్రిస్ గేల్ విధ్వంసకర బ్యాటింగ్ ఆడాడు. కానీ ఆర్చర్  వేసిన అద్భుతమైన యార్కర్ తో  చివరికి 99 పరుగుల వద్ద  వికెట్ అయిపోయాడు.



 అయితే క్రిస్ గేల్ వికెట్ తీసిన జఫ్ఫా ఆర్చర్ ఇప్పటికీ బాస్ క్రిస్ గేల్ అంటూ ట్వీట్ చేసి తోటి ఆటగాడు పై తనకున్న గౌరవాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా జొఫ్రా  ఆర్చర్  గతంలో చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక ఆర్చర్  పాత ట్వీట్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రీ ట్విట్  చేసింది. ఇంతకీ ఈ ట్విట్ లో ఏముందంటే.. నేను బౌలింగ్ చేస్తుంటే.. అతడు సెంచరీ చేయలేదు... అంటూ ఆర్చర్ 2013లో చేసిన ట్వీట్ ఇప్పుడు నిజమైంది అంటూ రాజస్థాన్ రాయల్స్ రీ ట్విట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: