ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసింది. కంగారులతో  తలపడి విజయం సాధించేందుకు ఆతృతగా ఎదురుచూస్తుంది భారత జట్టు. ఈ క్రమంలోనే భారత జట్టుకు పలు కీలక ఆటగాళ్లు దూరమవడం మాత్రం ఆందోళనలో పడుతూనే  ఉంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది అని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం గాయం బారినపడిన భారత కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ,  ఇషాంత్  శర్మ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారూ  అన్న విషయం తెలిసిందే. ఇద్దరు ఆటగాళ్ళు టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశం తక్కువగా ఉంది అందరికీ అర్థమవుతుంది.


 ప్రస్తుతం భారత ప్రేక్షకులు అందరూ కూడా ఈ ఇద్దరు కూడా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి ఆస్ట్రేలియాలో టెస్టు జట్టులో చేరుతారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ డిసెంబర్ 19  జనవరి 19 తేదీల మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం వీరిద్దరూ సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం గమనార్హం. కానీ వీరిద్దరి ఫిట్నెస్ నిశితంగా గమనిస్తామని  బోర్డు తెలిపింది. అయితే ఇటీవల ఇద్దరి ఫిట్నెస్ విషయంలో నేషనల్ క్రికెట్ అకాడమీ అధికారులు ఇటీవల సమావేశమై చర్చించి ఫలితాలు ఆశాజనకంగా లేవు అని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


 ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఇషాంత్ శర్మలు ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ జట్టులోకి చేరే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. ఫిట్నెస్ రిపోర్టులు ఆశాజనకంగా లేవని ప్రస్తుతం అధికారులు బిసిసిఐకి తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే ఇద్దరి ఫిట్నెస్ పై స్పందించిన టీమిండియా రావిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియా బయలుదేరక పోతే వారు ఆస్ట్రేలియాకి వచ్చినప్పటికీ కూడా సరిగ్గా రాణించడం కష్టమే అంటూ చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: