ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి వన్డే సిరీస్ ని మొదలు పెట్టి మొదటి మ్యాచ్లో భారత జట్టు జుట్టు కు ఎదురు దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే. మొదటి జట్టులోని ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన పరుగులను ఛేదించ లేక ఓటమి చవిచూసింది భారత జట్టు. ఇక ముఖ్యంగా భారత జట్టులోని బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలం కావడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ చెలరేగి ఆడారు.



 ఏకంగా భారత్ 67 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముఖ్యంగా అందరు ఆటగాళ్లు ఎంతో అద్భుతంగా రాణించారు నిన్న వన్డేlo. ఐపీఎల్లో పేలవ  ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న మ్యాక్సీ అద్భుతంగా రాణించి 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్  నిన్న మొదటి వన్డేలో తేలిపోయాడు.


 స్మిత్ మాక్స్వెల్ దెబ్బకు.. భారీ పరుగులు సమర్పించుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ 10 ఓవర్లలో ఒక వికెట్ తీసి 89 రన్స్  సమర్పించుకున్నారు. అయితే నిన్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లకు భారీగా పరుగులు సమర్పించుకున్న చాహల్  భారత స్పిన్  చరిత్రలోనే చెత్త రికార్డు నమోదు చేశాడు. వన్డేలో భారత స్పిన్నర్లు ఈ  స్థాయిలో పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే గతంలో ఉన్న చెత్త రికార్డు కూడా  చాహల్  పేరునే ఉండడం గమనార్హం. 2019లో వరల్డ్ కప్ లో  జరిగిన మ్యాచ్లో ఏకంగా 88 రన్స్  ఇచ్చుకున్నాడు.


 ఇక తన పేరున ఉన్న చెత్త రికార్డును తానే తిరగరాసుకున్నాడు యజ్వేంద్ర చాహల్ . ఒక దశలో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు అనిపించినప్పటికీ ఆ తర్వాత మ్యాక్స్వెల్ క్రీజులోకి వచ్చిన తర్వాత భారీగా సిక్సర్లు ఫోర్లు బాదాడు.  దీంతో చాహల్  అయోమయంలో పడిపోయాడు. ఇక టీం ఇండియా లో మరో బౌలర్ రవీంద్ర జడేజా ఎలాంటి వికెట్ తీయకుండా 63 పరుగులు ఇచ్చుకున్నాడు. నవదీప్ సైనీ 89 పరుగులు ఇవ్వగా బుమ్రా 73 పరుగులు సమర్పించుకున్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ  59 ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: