ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నభారత జట్టు మొదటి వన్డే సిరీస్ లో  తడబడి రెండు మ్యాచ్ లలో అపజయం పాలైన సిరీస్ చేజార్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఎంతో వేగంగా పుంజుకున్న భారత జట్టు ప్రస్తుతం వరుసగా విజయాలు అందుకుంటూ ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ ఇస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. వన్డే సిరీస్  చేజార్చుకున్నప్పటికీ టీమిండియా ఎక్కడ వెనకడుగు వేయకుండా అదే పట్టుదలతో మూడో మ్యాచ్లో విజయం సాధించి తమ పరువు నిలబెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే ఆస్ట్రేలియా భారత్ మధ్య తొలి టి20 సిరీస్ ప్రారంభం తొలి మ్యాచ్లో కూడా విజయం సాధించింది.


 ఇలా వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా జట్టు రెండవ టీ20 మ్యాచ్లో కూడా అద్భుత విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకుని ఆస్ట్రేలియా జట్టుపై  ప్రతీకారం తీర్చుకుంది అన్న విషయం తెలిసిందే. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా జట్టు ఎంతో అలవోకగా ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది.  అయితే నేడు భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడోటి 20 మ్యాచ్ జరగనుంది. అయితే ఇది నామమాత్రపు టి20 మ్యాచ్ అన్న విషయం తెలిసిందే.



 వరుసగా రెండో టీ20 మ్యాచ్ లలో  గెలిచిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇక అదే ఉత్సాహంతో మూడవ టి20 మ్యాచ్ లో కూడా విజయం సాధించి ఆస్ట్రేలియా జట్టు ను  క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అటు ఆస్ట్రేలియా జట్టు కూడా చివరి మ్యాచ్లో అయినా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని కసితో బరిలోకి దిగేందుకు సిద్ధం అయింది. ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.  కాగా ఈ రోజు మధ్యాహ్నం 1:40 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: