క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీలు ఎప్పుడు పురుషుల విభాగం లోనే చూస్తూ ఉంటాం. సెంచరీలు, డబుల్ సెంచరీలు, డబుల్ ఫాస్టెస్ట్ సెంచరీలు ఇలా చెప్పుకుంటూ పోతే పురుషుల విభాగంలో జరిగే క్రికెట్ లో రికార్డులకు కొదువే ఉండదు. క్రికెట్ లోని మహిళా విభాగం లో ఇలాంటి రికార్డులు చూడడం చాలా అరుదు. క్రికెట్ మహిళా విభాగంలో న్యూజిలాండ్ కు చెందిన సోఫి డివైన్ రికార్డ్ సృష్టించింది. టీ20 లలో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. 

న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ టి20 టోర్నమెంట్‌లో వెల్లింగ్టన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సోఫీ డివైన్‌ 38 బంతుల్లో 108 పరుగులతో రికార్డ్ సెంచరీ నమోదు చేసింది.  కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది మహిళల టి20 క్రికెట్‌లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. అయితే ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్‌ ప్లేయర్‌ డియోండ్ర డాటిన్ పేరు మీదుగా ఉంది. డాటిన్ ‌38 బంతుల్లో దక్షిణాఫ్రికా జట్టుపై 2010లో ఈ రికార్డ్ నమోదు చేసింది. 

అయితే ప్రస్తుతం ఈ రికార్డ్ ను డివైన్ బద్దలు కొట్టింది. డివైన్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో చెలరేగడంతో  ప్రత్యర్థి జట్టుపై 10 వికెట్లతో ఘనవిజయాన్ని అందించింది. తొలుత ఒటాగో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 128 పరుగులు చేసింది. అనంతరం వెల్లింగ్టన్‌ జట్టు 8.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 131 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్‌ మ్యాడీ గ్రీన్‌ (15 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించింది. తాజా శతకంతో సోఫీ డివైన్‌ మహిళల టి20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (6) చేసిన క్రికెటర్‌గా కూడా గుర్తింపు పొందింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: