ఒక సాదాసీదా ఆటోడ్రైవర్ కొడుకు ఐపీఎల్ లో  కోట్ల రూపాయలలో వేలానికి అమ్ముడు పోవటం  అప్పట్లో హాట్ టాపిక్గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  ఒక ఆటో డ్రైవర్ అయినప్పటికీ ఎంతో కష్టపడి తన కొడుకు క్రికెట్ ఆడటానికి ప్రోత్సహించడం.. ఇక ఆ తర్వాత అతని ప్రతిభను గుర్తించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో  కొనుగోలు చేయడంతో ఇక ఎంతో మంది యువతకు మహమ్మద్ సిరాజ్ ఆదర్శంగా నిలిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆ తర్వాత ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన తర్వాత మాత్రం మహమ్మద్ సిరాజ్ కొన్ని రోజుల పాటు నిరాశపరిచాడు అనే చెప్పాలి. ఇక ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు  మహమ్మద్ సిరాజ్.



 ఇక ఈ సారైనా సిరాజ్ బాగా రాణిస్తాడో  లేదో అని అనుకున్నారు అభిమానులు బాగా రాణించడం కాదు టీమిండియాకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు మహమ్మద్ సిరాజ్. ఇక ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభంలోనే తండ్రి మరణం అతని హృదయాన్ని ఎంతో కలిచివేసినప్పటికీ.. ఇక ఆస్ట్రేలియా అభిమానులు మహ్మద్ సిరాజ్ పై జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టి నప్పటికీ...  ఆ కసి  మొత్తాన్ని కూడా క్రికెట్ పై చూపించిన మహమ్మద్ సిరాజ్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టడం లో విజయం సాధించాడు. ఈ క్రమంలోనే టీమిండియా జట్టు కు ఒక మంచి బౌలర్ దొరికాడు అని ఎంతో మంది మాజీ లు కూడా మహమ్మద్ సిరాజ్ పై ప్రశంసల వర్షం కురిపించారు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ కూడా దీనిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మొహమ్మద్ సిరాజ్ లాంటి ఒక గొప్ప బౌలర్ ను టీమిండియా కోసం కనుగొన్నాము  అంటూ టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఎంతో రసవత్తరంగా సాగిన సిరీస్ లో  అద్భుతంగా మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ నైపుణ్యంతో  అదరగొట్టాడు అంటూ  ప్రశంసలు కురిపించాడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికి కూడా ఎక్కడ తడబడకుండా ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక సమయంలో వికెట్లు పడగొట్టి.. భారత జట్టుకు విజయం అందించడంలో యువ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు అంటూ రావిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: